- 05-02-2010
- మార్కెట్ రిపోర్ట్
బలహీనమైన ప్రపంచ మార్కెట్ల నేపధ్యం లో, మా అంచనాలకి అనుగుణం గా , నేడు మార్కెట్లు భారి గా నష్టపోయాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ సెన్సెక్స్ 434 పాయింట్లు కోల్పోయి 15790 పాయింట్ల వద్ద ముగియగా, నిఫ్టీ పాయింట్ల 127 నష్టాన్ని మూటగట్టు కొని దిద్దుబాటు కి గురి అయ్యింది. నిఫ్టీ 4718 పాయింట్ల వద్ద ముగిసింది.
పెరుగుతున్న ద్రవ్యోల్బణం ఒక వైపు , దారుణమైన ప్రపంచ మార్కెట్ల పోకడలు నేటి ట్రేడింగ్ లో బుల్ల్స్ వెన్ను విరిచాయి. ఆర్ధిక సలహాదారుడు , మాజీ రిజర్వు బ్యాంక్ గవర్నర్ రంగరాజన్ , ఉద్దిపనలు ఇప్పట్లో ఉపసంహరించేది లేదని స్పష్టం చేసినప్పటికీ మార్కెట్ల సెంటిమెంట్ కోలుకోలేదు. దీనితో ఆద్యంతం మారెట్ల లో నష్టాల పరంపర కొనసాగింది.
నేటి ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ రంగం 2.6 శాతం , స్మాల్ క్యాప్ రంగం 3.25 శాతం నష్టపోయింది. సేక్టరాల్ సూచీ ల లో నేడు కూడా అన్ని ఇండెక్స్ లు నష్టపోయాయి. నేడు రియాలిటి రంగం అత్యదికం గా 4.36 % నష్టపోగా , మెటల్స్ రంగం 4.26 శాతం కోల్పోయింది.
సెన్సెక్స్ స్టాకు ల లో నేడు కేవలం టాటా పవర్ 0.80 % లాభపడి బుల్ల్స్ పక్షాన నిలిచింది. కాగా bears తమ ప్రతాపాన్ని కనపరుస్తూ టాటా స్టీల్ ని 4.65 %, హిందాల్కో ని 5.5 % మేరకు నష్టపరచాయి. నేటి ఉదయం మేము అమ్మివేయమని సూచించిన జై కార్ప్ A గ్రూప్ లో అత్యధికం గా 8.92 % నష్ట పోవటం గమనార్హం .