- 06-02-2010
- మార్కెట్ రిపోర్ట్
నూతన ట్రేడింగ్ విధానాన్ని పరీక్షించే నేపధ్యం లో నేడు నిఫ్టీ , సెన్సెక్స్ లు ట్రేడ్ అయ్యాయి. నేటి 90 నిమిషాల ప్రత్యేకే ట్రేడింగ్ లో , మా అంచనాలకు అనుగుణం గా మార్కెట్లు లాభపడ్డాయి. నేడు సెన్సెక్స్ 124 పాయింట్లు లాభపడి , 15915 పాయింట్ల వద్ద ముగియగా, నిఫ్టీ 38.60 పాయింట్ల లాభం తో 4757 పాయింట్ల వద్ద ముగిసింది. ఒక దశ లో సెన్సెక్స్ అత్యధికం గా 15951 పాయింట్ల వరకు ఎగబాకింది. ఐతే మేము సూచించిన 15957 అవరోధం చేదించ లేకపోవటం తో చివరికి 15915 పాయింట్ల వద్ద పయనం ముగించింది.
నేటి ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ రంగం 1.40 శాతం, స్మాల్ క్యాప్ రంగం 1.564 శాతం లాభపడ్డాయి.
నేడు సేక్టరాల్ సూచీలు అన్ని కూడా లాభాలను ఆర్జించటం విశేషం .సేక్టరాల్ సూచీ ల లో నేడు రియాలిటీ అత్యధికం గా 2.14 % ఎగబాకింది . కాగా మెటల్స్ రంగం శాతం మేరకు లాభాలను అర్జించింది. సెన్సెక్స్ స్టాకు ల లో హీరో హోండా 0.24 %, భారతి అయిర్ టెల్ ౦.౦౩ % స్వల్పంగా నష్టపోగా , హిందాల్కో 2.39 %, జై ప్రకాష్ 2.24 % మేరకు అత్యధికం గా లాభపడ్డాయి.