• 5-2-2010
  • మార్కెట్ నాడి

నిరుద్యోగ భత్యం కోసం అంచనాలను మించి అభ్యర్ధనలు నమోదు కావటం తో గత రాత్రి అమెరికా మార్కెట్లు భారి గా నష్టపోయాయి. ఐరోపా మార్కెట్ల లో నెలకొని ఉన్నఅస్థిరత వలన ముందుగానే బలహీనం గా ఉన్న మార్కెట్లకి ,ఈ అంశం మరింత బెంబేలు పుట్టించింది .అమెరికా మార్కెట్లు నిన్న సుమారు ౩% నష్టపోయాయి.

ఈ కారణం తో నేడు జపాన్, ఆస్ట్రేలియా , సింగపూర్ మార్కెట్లు కూడా తీవ్ర నష్టాల ను నమోదు చేస్తున్నాయి. బలహీనమైన ఐరోపా మార్కెట్లు, ముఖ్యం గా గ్రీసు ,స్పేన్ , పోర్చుగల్ దేశాల లో క్రెడిట్ ఎగవేత భయాందోళన నెలకొని ఉండటం వలన యూరో కరన్సీ బలహీనపడింది. దీనితో అమెరికా డాలర్ భారీగా బలపడటం తో , మదుపర్లు కమోడిటి లను వదిలి వేసి డాలర్ పట్ల మోజు చూపటం తో కమోడిటి లు , ముఖ్యం గా బంగారం , ముడి చమురు తీవ్ర నష్టాలకు గురి అవుతున్నది. కమోడిటిల దెబ్బ వలన ఆసియా మార్కెట్లు నేడు మరింత కృంగిపోతున్నాయి.

అత్యంత బలహీనమైన ప్రపంచ మార్కెట్ల నేపధ్యం లో నేడు మన మార్కెట్లు కూడా రక్త సిక్తం కానున్నాయి. పైగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం పై కట్టడి చేసే ప్రయత్నం లో ప్రభుత్వం , రిజర్వు బ్యాంక్ మరిన్ని చర్యలు చేపట్టే యోచన చేస్తున్నాయి. ఈ నేపధ్యం లో IMF కూడా , భారత దేశం లో కీలక వడ్డీ రేటు ని పెంచే సమయం వచ్చేసిందని ప్రకటించటం కూడా గమనార్హం. కాబట్టి నేడు బుల్ల్స్ కి నిలువ నీడ దొరికే అవకాశం తక్కువ. ఐతే ప్రముఖ అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మార్గాన్ స్టాన్లీ భారత్ దేశపు ఆర్థికాభివృద్ధి పై అంచనాలను పెంచటం కొంత ఊరట కలిగించే అంశం. 2010 /11 సంవత్సరానికి గాను భారత్ GDP వృద్ధి 8.5 % మేరకు ఉండగలదని ఈ ఏజెన్సీ అంచనా వేసింది.

ఈ అంశాల నడుమ నేడు మన మార్కెట్లు అతలాకుతలం కానున్నాయి. నేడు భారి గ్యాప్ డౌన్ తో మన మార్కెట్లు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. షార్ట్ పొజిషన్ వారిని ఇరికించే విధం గా ఆపరేటర్లు కూడా తమ నైపుణ్యం ప్రదర్శించే అవకాశం ఉన్నందున అనుభవం లేని వారు మార్కెట్లకు దూరం గా ఉండటం మంచిది.

  • నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
  • గత ముగింపు: 16225
  • అవరోధాలు: 16252-16340-16496
  • మద్దత్తులు:16124-16064-15957 - 15831-15554