• 4-2-2010
  • మార్కెట్ రిపోర్ట్

బలహీనమైన ఆసియా మార్కెట్ల నేపధ్యం లో నష్టాల తో ప్రారంభమైన మన మార్కెట్లకు " గ్రీకు వీరుడి" షాక్ తగలడం తో బావురుమన్నాయి .దీనితో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 271 పాయింట్లు కోల్పోయి 16225 పాయింట్ల వద్ద ముగియగా , నిఫ్టీ 86 .5 పాయింట్ల నష్టం తో 4845 పాయింట్ల వద్ద ముగిసింది. మధ్యానం తాజా ట్రేడ్ లో స్పేన్, గ్రీస్ , పోర్చుగల్ దేశాల లో క్రెడిట్ డిఫాల్ట్ తారా స్థాయికి చేరిందన్న వార్త తో ఐరోపా మార్కెట్లు మట్టికరిచాయి. దీనితో మన మార్కెట్ల లో భల్లుకాలు వీరవిహారం చేసాయి. అదే విధం గా , మధ్యాన్నం విడుదల అయిన మన దేశపు ఆహార ద్రవ్యోల్బణ గణాంకాలు కూడా మార్కేట్లని కూలదోసాయి . జనవరి 23తో ముగిసిన వారాంతానికి ఆహార ద్రవ్యోల్బణం రేటు 17.56 శాతానికి చేరుకుంది. అదే టోకు ధరల ఆధారంగా ఆహార ద్రవ్యోల్బణం అంతకు మునుపు వారంలో 17.40 శాతంగా ఉండింది.. దీనితో అమ్మకాల వత్తిడి మరింత గా ఊపందుకుంది . నేటి ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ రంగం 2 శాతం, స్మాల్ క్యాప్ రంగం 1.6 శాతం నష్టపోయాయి. కాగా సెక్టోరల్ సూచిలన్నీ కూడా నేడు నష్టపోయాయి. రియాలిటీ రంగం అత్యధికం గా 3.9శాతం, మెటల్స్ రంగం 3.4 శాతం చొప్పున భారి నష్టాలను నమోదు చేసాయి. సెన్సెక్స్ స్టాకు ల లో అత్యధికం గా శాతం నష్టపోయింది. కాగా JP ASSOCIATES శాతం కోల్పోయింది. ONGC 0.6 % , ITC 0.3 % స్వల్పంగా నష్టపోయింది.