• 4-2-2010
  • మార్కెట్ నాడి

గత రాత్రి అమెరికా మార్కెట్లు మిశ్రమంగా ముగిసాయి. సేవా రంగం లో ఆశించినంత వృద్ధి నమోదు కాకపోవటం తో ఉత్పత్తి రంగం నుండి అభివృద్ధి ఇతర రంగాల లో విస్తరించేందుకు గాను మరింత సమయం పట్టనున్నదని అంచనాల తో అమెరికా మార్కెట్లు మిశ్రమంగా ముగిసాయి. నేడు ఆసియా మార్కెట్లు కూడా బలహీనం గా ప్రారంభమైనాయి. పైగా నేడు ఆస్ట్రేలియా లో విడుదల అయిన డిసెంబర్ తాలూకు చిల్లర అమ్మకాల గణాంకాలు ఘోరం గా పతనం కావటం తో అక్కడి మార్కెట్లు తీవ్రం గా నష్టపోతున్నాయి. ఈ ప్రభావం ఇతర ఆసియా మార్కెట్ల కు కూడా విస్తరిస్తున్నందున ఆసియా మార్కెట్ల లో కమోడిటి లు ,ముఖ్యం గా ముడి చమురు , నష్టపోతున్నాయి .

చమురు విధానం పై నిన్న నివేదిక ని సమర్పించిన పరీక్ కమిటి , చమురు , గ్యాస్ ధరల పై ప్రభుత్వ నియంత్రణ ని పూర్తి గా తొలగించాలని సిఫారిసు చేసింది. ఈ సిఫారిసు ని ప్రభుత్వం ఆమోదిస్తే, స్టాక్ మార్కెట్లకు, ముఖ్యం గా చమురు ఉత్పత్తి, పంపిణీ కంపనీలకు లాభదాయకం. ఐతే ఈ అంశం పై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకునేందుకు పెరుగుతున్న ద్రవ్యోల్బణం అవరోధం గా మారనున్నది. పైగా గ్యాస్ ధరలను పెంచితే , ప్రజా వ్యతిరేకతే కాక ఫర్టి లైజేర్ కంపనీలు కూడా పెరిగిన గ్యాస్ ధరల మేరకు ప్రభుత్వ సబ్సిడి ని కోరే అవకాశం ఉంది. ప్రస్తుతం తలెత్తనున్న ఆహార ధాన్యాల కొరత వలన ప్రభుత్వం, ఫర్టిలై జేర్ కంపనీల పట్ల సానుభూతితో వ్యవహరించే అవకాశాలే ఎక్కువ. అంటే , గ్యాస్ ధరలు పెంచితే , ఆ సబ్సిడి ప్రభుత్వమే భరించ వలసి వస్తుంది. అప్పుడు బడ్జెట్ లోటు మరింత గా పెరుగుతుంది. ఈ కారణాల వలన , ప్రభుత్వం ఈ అంశం పై తొందర పడి నిర్ణయం తీసుకోదు. ఈ అంశం పై అంతర్జాతీయ రేటింగ్ సంస్థ FITCH స్పందిస్తూ , చమురు వెలికితీత కంపనీల విషయం స్థిరంగా ఉన్నా , చమురు పంపిణీ కంపనీలకి కష్టకాలమని జోస్యం చెప్పింది . ఐతే ప్రైవేటు పంపిణి సంస్థల కి పరవాలేదని సూచించింది. ఈ అంశం మార్కెట్లు నిశితం గా పరిశీలించ నున్నాయి. బలహీనమైన ప్రపంచ మార్కెట్ల నేపధ్యం లో నేడు మన మార్కెట్లు కూడా బలహీనత ప్రదర్శించే అవకాశం ఉంది. నేడు విడుదల కానున్న ద్రవ్యోల్బణ గణాంకాలు మధ్యానం తదుపరి మార్కెట్ల దిశని నిర్ణయించే అవకాశం ఉంది.

  • నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
  • గత ముగింపు: 16496
  • అవరోధాలు: 16527 -16606-16765
  • మద్దత్తులు:16340-15252-16124-16064-