- 3-2-2010
- మార్కెట్ రిపోర్ట్
నిన్నటి భల్లుకాల దెబ్బకి ప్రతీకారం తీర్చుకునే విధం గా నేడు బుల్ల్స్ ,మార్కెట్ల లో తమ ప్రతాపం కనపరచాయి. దీనితో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ 332 పాయింట్లు లాభపడి 16496 పాయింట్ల వద్ద ముగియగా, నిఫ్టీ పాయింట్లు సెంచరి పాయింట్ల వృద్ధి ని నమోదు చేసి 4931 పాయింట్ల వద్ద ముగిసింది. సానుకూల ప్రపంచ మార్కెట్ల నేపధ్యం లో శుభారంభం చేసిన మన మార్కెట్ల లో షార్ట్ కవేరింగ్ కూడా చోటు చేసుకోవటం తో నేడు మార్కెట్లు ఆద్యంతం లాభాలో నడిచింది.
చమురు ధరల నియంత్రణ పై ఏర్పరిచిన కిరిట్ పరీక్ కమిటీ నేడు తమ నివేదికను సమర్పించింది. ఈ నివేదిక లో పెట్రోల మరియు డిజిల్ ధరలను నియంత్రణ నుండి పూర్తి గా తొలగించాలని సిఫారిసు చేయటం గమనార్హం
నేటి ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ రంగం 1.5 % స్మాల్ క్యాప్ రంగం 1.1% ఎగబాకింది. సెక్టోరల్ సూచీలు అన్ని కూడా నేడు లాభాల లో పయనించటం విశేషం. నేటి ట్రేడింగ్ లో మెటల్స్ సూచీ 4% , రియాలిటి రంగం 2.8 % ఎగబాకింది
నేడు సెన్సెక్స్ స్టాకు ల లో స్టర్ లైట్ అత్యదికం గా 6 % ఎగబాకగా, టాటా స్టీల్ 4.9 % లాభపడింది. కాగా సన్ ఫార్మా 1 % మేరకు క్షీణించింది.