- 3-2-2010
- మార్కెట్ నాడి
మందకొడిగా ప్రారంభమైన అమెరికా మార్కెట్లు, గత రాత్రి గృహ అమ్మకాల గణాంకాలు సానుకూలం గా విడుదల కావటం తో , లాభాల బాట లో నడిచాయి. దీనితో అమెరికా మార్కెట్ల లో రికవరి జరుగుతున్నదన్న అంచనాల తో మార్కెట్లు బలంగా ముగిసాయి. కమో డిటిలు , ముఖ్యం గా అల్యూమినియం, రాగి , కూడా అంతర్జాతీయ మార్కెట్ల లో బలపడ్డాయి.
సానుకూల వాల్ స్ట్రీట్ ప్రభావం వలన నేడు ఆసియా మార్కెట్లు కూడా లాభాల ప్రక్రియ ని కొనసాగిస్తున్నాయి. జపాన్ మార్కెట్లు లాభాల లో ప్రారంభమైనప్పటికీ, కీలక కంపనీలైన హోండా , షార్ప్ ఫలితాలు నేడు విడుదల కానున్నందున గ్యాప్ అప్ తో లభించిన లాభాలను కొంత విసర్జించాయి. ఐతే ఇతర ఆసియా మార్కెట్లు లాభాల బాట లో నడుస్తుండటం మన మార్కెట్ల కి శుభ సూచకం
మన మార్కెట్ల ను ప్రభావితం చేసే అంశాలను పరిశీలిస్తే, NTPC FPO నేటి నుండి ప్రారంభం కానున్నది. ఈ ఆఫర్ లో రూ. 210 గా ఫ్లోర్ ప్రైస్ ని నిర్ణయించారు. ( CMP RS 206) . కాగా కేంద్ర ప్రభుత్వం తరహా లో గుజ రాత్ ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వ వాటాలను కొన్ని కంపనీల నుండి ఉపసంహరించా నున్నట్లు ప్రకటించింది. ముందుగా GUJARAT STATE PETRO CORPORATION లోని వాటాలను IPO ద్వారా విక్రయించనున్నట్లు ప్రకటించింది. ఈ అమ్మకాల ద్వారా 32500 కోట్ల రూపాయలను సమకూర్చనున్నట్లు ప్రకటించింది. ఈ కారణం గా , గుజ రాత్ కి సంభందించిన స్టాకు ల పట్ల నేడు మదుపర్లు ఆసక్తి కనపరచ నున్నారు. ఇది ఇలా ఉండగా ప్రముఖ మార్గాన్ స్టాన్లీ సంస్థ , భారత్ కి చెందిన కన్సుమెర్ (fmcg) స్టాకుల పట్ల రేటింగ్ ని తగ్గించింది. ఈ కారణం గా HUL , DABUR, COLGATE PALMOLIVE మున్నగు స్టాకులు ప్రభావితం కానున్నాయి. నిన్న ప్రపంచ మార్కెట్లు సహకరించినప్పటికీ , మన మార్కెట్ల లో అమ్మకాల వత్తిడి కొనసా గింది నేడు కూడా మార్కెట్లు పెరిగితే , మదుపరులు మరొక సారి అమ్మకాల వైపు మొగ్గు చూపే అవకాశం లేకపోలేదు. ఐనప్పటికీ, నేడు మార్కెట్లు , వరుస నష్టాల నుండి కొంత ఊరట పొందే అవకాశం ఉంది.
నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
- గత ముగింపు: 16160
- అవరోధాలు: 16252-16340-16477-16527
- మద్దత్తులు:16124-16064-15957