• 2-2-2010
  • మార్కెట్ రిపోర్ట్

బాంబే స్టాక్ మార్కెట్ నేడు నష్టాలతో ముగిసింది. నేటి ట్రేడింగ్ లో ఒడిదుడుకులను ఎదుర్కొన్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్, ట్రేడింగ్ ముగిసే సమయానికి 192 పాయింట్ల మేర పతనమై, 16,163 పాయింట్ల మార్కును తాకింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 74 పాయింట్లు క్షీణించి, 4824 పాయింట్ల మార్కు వద్ద నిలిచింది

ఉదయం మా అంచనాలకి అనుగుణం గా శుభారంభం చేసిన సెన్సెక్స్ గరిష్టం గా 16526 పాయింట్ల వరకు ఎగబాకింది. ఐతే మేము సూచించ 16527 పాయింట్ల అవరోధం చేదించలేక పోవటం తో మార్త్కెట్ల లో ప్రాఫిట్ బుకింగ్ చోటు చేసుకుంది. దీనితో మార్కెట్ల లో BEARS కి అవకాశం కలిగినట్లయ్యింది. ఒక దశ లో సెన్సెక్స్ కనిష్టం గా 16129 పాయింట్ల వరకు కోల్పోయింది. ఐతే మేము సూచించిన 16124 మద్దత్తు స్థాయి నిలవటం తో మార్కెట్లు చివరికి 16163 పాయింట్ల వద్ద ముగిసింది.

నేటి ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ రంగం 1.2% , స్మాల్ క్యాప్ రంగం 0.77% మేరకు నష్టపోయాయి.

నేటి ట్రేడింగ్ లో అన్ని సేక్టరాల్ సూచీలు నష్ట పోయాయి. రియాలిటి రంగం 2 .45 %, బ్యాంకింగ్ రంగం 2 % మేరకు నష్టపోయాయి.

సెన్సెక్స్ స్టాకు ల లో నేడు JAIPRAKASH ASSOCIATES అత్యధికం గా 3.73 % నష్టపోగా , గ్రాసిం 2.94 % మేరకు కోల్పోయింది. కాగా HDFC 1.50 % ,HINDALCO 1.31 % చొప్పున లాభపడ్డాయి.