• 26-2-2010
  • మార్కెట్ రిపోర్ట్

నేడు ఆర్ధిక మంత్రి పార్లమెంట్ లో కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టారు. బడ్జెట్ లోటు GDP కి 5.5 % వరకు అరికట్టే విధం గా బడ్జెట్ ప్రస్తావన చేయటం తో మార్కెట్లు లాభపడ్డాయి. ఈ అంశం మేము నేటి ఉదయం "మార్కెట్ నాడి " శీర్షిక లో చర్చించినది మీకు తెలుసు. మా అంచనాలని నిజం చేస్తూ నేడు మార్కెట్లు లాభపడ్డాయి. గత రెండు రోజులు గా మార్కెట్లు పడినప్పుడు కొనుగోలు చేయమన్న మా సూచన పాటించిన వారికి నేటి బడ్జెట్ లాభాల పంట పండించింది. బడ్జెట్ లోటు fyr 2011 - 5.5 %, 2012 -4. 8 % వేయటం జరిగింది. మార్కెట్ల నుండి ఈ సంవత్సరానికి 3.45 లక్షల కోట్ల రూపాయలు ఋణం గా సమీకరించాలని బడ్జెట్ లో ప్రస్తావించటం జరిగింది. ఏప్రిల్ 2011 నాటికి ప్రత్యక్ష పన్ను విధానం , మరియు GST అమలు పరచగలమని మంత్రి విశ్వాసం వెలుబుచ్చారు. ఉద్యోగుల కు ఈ సారి ఉపశమనం కలిగిస్తూ పన్నురాయితీలు గణనీయం గా పెంచారు. ఇన్ఫ్రా బాండ్ల లో రూ. 20, 000 మేరకు పెట్టుబడులకు పన్ను రాయితీ కల్పించటం విశేషం. కాగా MAT మాత్రం 15 % నుండి 18 % వరకు పెంచటం జరిగింది. సర్ చార్జి 10 % నుండి 7.5 % వరకు కుదించారు. కేంద్ర ఎక్సైజ్ పన్ను 8 % నుండి 10 % పెంచారు . సర్వీసు టాక్స్ 10 % వద్ద యధావిధి గా ఉంచారు. పెట్రోల్ , డిజిల్ పై పన్ను పోటు వలన నేటి అర్ధ రాత్రి నుండి చమురు మార్కెటింగ్ కంపనీలు లీటరుకి రూ 2.67 , 2.58 చొప్పున పెంచనున్నాయి

నేటి ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 175పాయింట్లు లాభపడి 16429 పాయింట్ల వద్ద ముగిసింది. కాగా నిఫ్టీ 62.55 పాయింట్లు ఎగబాకి 4922 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్ 1.08 శాతం, నిఫ్టీ 1.29 శాతం చొప్పున లాభపడ్డాయి. నేడు మిడ్ క్యాప్ రంగం 1.5 శాతం , స్మాల్ క్యాప్ రంగం 1.1 శాతం చొప్పున లాభపడ్డాయి.

నేడు ఆటో సూచీ అత్యధికం గా 4.7 % ఎగబాకింది .మెటల్స్ 2.6 % మెరుగు దిద్దుకుంది. కాగా FMCG 2.2 %, ఐ. టి 0.3 % నష్టపోయాయి.

సెన్సెక్స్ స్టాకు ల లో నేడు రిలయన్స్ క్యాపిటల్ 7.8 %, టాటా మోటర్స్ 7.2 % ఎగబాకాయి . కాగా ITC అత్యధికం గా 5.7 %, టాటా పవర్ 4.4 % నష్టపోయాయి.

  • బడ్జెట్ లోని కీలక ప్రస్తావనల కై దయచేసి " మార్కెట్ ఫోకస్ " పేజిని చూడండి