- మార్కెట్ ముందు చూపు
- 2-3-2010 నుండి 5-3-2010 వరకు
కేంద్ర బడ్జెట్ సానుకూలం గా ఉండటం తో , గత వారం అప్రమత్త ధోరణి లో ట్రేడ్ అయిన మన మార్కెట్లు , ఒక్క సారిగా శుక్రవారం ఎగబాకాయి. దీనితో మంగళవారం నుండి పునః ప్రారంభం కానున్న మార్కెట్లల లో కొంత ఉత్సాహం కనిపించే అవకాశాలు మెరుగైనాయి. హోలీ పండగ కారణం గా సోమవారం మార్కెట్లకు సెలవు. ఐతే మార్కెట్లు గత శుక్రవారం ముగింపు లో చివరన మరొక సారి ప్రాఫిట్ బుకింగ్ కి గురి అయినందు వలన , మన మార్కెట్లు స్థిరం గా పెరగాలంటే ప్రపంచ మార్కెట్లు కొంత మేరకైనా సానుకూలం గా ఉండటం ముఖ్యం. గ్రీక్ దేశపు ఆర్ధిక సంఖోభం, అమెరికా లో ఉద్యోగ గణాంకాలు ఈ వారం విడుదల మన మార్కెట్లను ప్రభావితం చేసే అవకాశం ఉంది. గత శుక్రవారం ముగింపు సమయం లో నిఫ్టీ తాలూకు మార్చ నెల F & o ఫ్యుచేర్స్ గరిష్టం గా 5002 నుండి 4935 పాయింట్ల వరకు పడిపోయింది. కాబట్టి మన మార్కెట్ల ల లో ఈ వారం లో పూర్తి గా బుల్ల్స్ హవా కొనసాగుతుందని గట్టి గా చెప్పలేము. ఐనప్పటికీ సానుకూల బడ్జెట్ మదుపర్ల లో కొంత విశ్వాసం నింపి దనే చెప్పాలి.
శుక్రవారం ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్ లో ఆర్ధిక మంత్రి బడ్జెట్ లోటు ని మునుముందు తగ్గించగలమని వివరణ ఇవ్వటం కూడా మన మార్కెట్ల పట్ల విదేశీ మదుపరులకు కొంత విశాసం కలిగించే విధం గా ఉంది. మార్గాన్ స్టాన్లీ సంస్థ బడ్జెట్ పై స్పందిస్తూ , మార్కెట్ల లో దిద్దుబాటు జరిగినప్పుడు తప్పకుండా కొనుగోలు చేయాలని, ప్రస్తుతానికి కొన్ని స్టాకు ల ధరలు తారా స్థాయి లో ఉన్నాయని ప్రకటించింది.
ఈ అంశాలను విశ్లేషిస్తే , అధిక స్థాయి లో ప్రాఫిట్ బుకింగ్, కనిష్ట స్థాయి ల లో కొనుగోళ్ళు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి మార్కెట్లు ఈ వారం సానుకూలం గా ట్రేడ్ అయినా range bound పరిమితి స్థాయిల మధ్య ట్రేడ్ అయ్యే అవకాశం లేకపోలేదు .కాబట్టి మదుపర్లు ఈ వారం ఇండెక్స్ ట్రేడింగ్ కంటే కూడా స్టాకుల పరంగా పెట్టుబడులు పెట్టటం మరింత లాభదాయకం కానున్నది.
స్టాకు ల పరం గా , బడ్జెట్ ప్రతిపాదనలను పరిశీలిస్తే , బడ్జెట్ లో ఇన్ఫ్రా రంగానికి పెద్ద పీట వేయటం వలన ఇన్ఫ్రా స్టాకులు, ముఖ్యం గా చిన్ని తరహా హైడ్రో ప్రాజెక్ట్లు , రోడ్ల నిర్మాణం లో నిమగ్నమైన స్టాకులు కొంత లాభపడే అవకాశం ఉంది. గ్రీన్ పవర్ పట్ల కల్పిస్తున్న రాయితీల కారణం గా SUZLON, MOSER BAER మున్నగు కంపనీలకు బడ్జెట్ లాభదాయకం గా మారనున్నది. మరిన్ని బ్యాంకింగ్ లైసెన్స్లు జారిచేయనున్నట్లు చేసిన ప్రతిపాదన వలన RELIANCE CAPITAL, TATA CAP, BIRLA CAP, MUTHOOT FINANCE, DBS CHOLA , STFC ,మున్నగు స్టాకు ల లో కొనుగోళ్ళు కనిపించే అవకాశం ఉంది. బడ్జెట్ ప్రతిపాదన వలన స్టీల్ , సిమెంట్ రంగాలకి ముడి సరుకుల ధరలు మరింతగా పెరగనున్నాయి .ఫార్మా లో పరిశోధన కు బడ్జెట్ ప్రయోజనం చేకుర్చనున్నందు వలన RANBAXY, SUN PHARMA మున్నగు ఫార్మా పరిశోధన కంపనీల కు కొంత లాభం చేకూరే అవకాశం ఉంది. పొగాకు ఉత్పత్తు ల పై పన్ను పోటు తీవ్రతరం చేయటం వలన ITC కి ఈ బడ్జెట్ ప్రతిపాదన నష్టం చేకూర్చ నున్నది. ఐతే సిగరెట్ల ధర ఎంత పెరిగినా గాని పొగరాయుళ్ళు ఏ మాత్రం జంకబోరని గతం లో నిరూపితం అయ్యింది. కాబట్టి దీర్ఘ కాలం లో ITC కి పెద్దగా నష్టం వాటిల్లబోదని మా అభిప్రాయం .కాబట్టి ఈ కౌంటర్ ని దీర్ఘకాలిక మదుపరులు మద్దత్తు స్థాయిల వద్ద కొనుగోళ్ళు చేయవచ్చు.
ఈ వారం మార్కెట్లకు స్థూలం గా .. నిఫ్టీ 5000 పాయింట్ల ఎగువన తీవ్ర అవరోధం ఎదురుకోనున్నది. కాగా 4800 వద్ద మద్దత్తు లభించే అవకాశం ఉంది. కాగా సెన్సెక్స్ నకు 15 రోజుల చలన సగటు అయిన 16186 పాయింట్లు తక్షణ మద్దతు గా భావించ వచ్చు. కాగా 16720 పాయింట్ల 50 రోజుల చలన సగటు తక్షణ అవరోధం కానున్నది. 17226 పాయింట్ల స్థాయి కీలక అవరోధం గా పరిగణించవచ్చు
అంతర్జాతీయ మార్కెట్ల తీరు తెన్నులే కాక , ఈ వారం విడుదల కానున్న సిమెంట్ , కార్ల అమ్మకాల /ఎగుమతుల గణాంకాలు మార్కెట్లను ప్రభావితం చేసే ఇతర అంశాలు .