• 25-2-2010
  • మార్కెట్ నాడి

గత రాత్రి అమెరికా మార్కెట్ల లో వెలవడిన గృహ అమ్మకాల గణాంకాలు అత్యంత నిరుత్సాహం కలిగించే విధం గా ఉన్నప్పటికీ, అమెరికా ఫేడ్ అద్యక్షులు బెన్ బెర్నంకే , అక్కడి కీలక వడ్డీ రేటు పై చేసిన స్పష్టీకరణ మార్కెట్లకు ఉపశమనం కలిగించాయి. ప్రస్తుత పరిస్థితు ల లో వడ్డీ రేటుని ఎట్టి పరిస్థితి లో పెంచబోమని బెన్ చేసిన ప్రకటన తో మార్కెట్లు లాభాల బాట లో నడిచాయి.

ఈ సానుకూల అంశం వలన నేడు ఆసియా మార్కెట్లు సైతం నిన్నటి నష్టాలను పక్కకి పెట్టి నేడు లాభాల లో నడుస్తున్నాయి. గత మూడు రోజులు గా లండన్ మార్కెట్ల లో నష్టపోతున్న కమోడిటి లు కూడా లాభపడటం నేడు ఆసియా మార్కెట్లకు కలిసోచ్చినట్లయ్యింది . నేడు సింగపూర్, జపాన్ మార్కెట్ల లో టెక్నాలజీ , బ్యాంకింగ్ స్టాకులు లాభాల తో నడవటం తో ఈ మార్కెట్లు విశేషం గా లాభాల లో పయనిస్తున్నాయి.

మన మార్కెట్ల పరంగా నేడు ఫిబ్రవరి తాలూకు డెరి వెటివ్స్ F & O ముగింపు సందర్భం గా మన మార్కెట్లు నేడు ప్రపంచ మార్కెట్ల పయనానికి అతీతం గా వ్యవహరించవచ్చు. నేటి మార్కెట్ల గమనం ప్రధానం గా నేడు చోటు చేసుకోబోయే రోల్ ఓవర్ల పై ఆధార పడనున్నది. పైగా రేపు ఆర్థిక మంత్రి ప్రకటించ బోయే బడ్జెట్ పై మార్కెట్ సతమత మయ్యే నేపధ్యం లో నేడు మార్కెట్ల గమనం ఖచ్చితం గా అంచనా వేయటం కష్టం . నిన్న ప్రకటించిన రైల్వే బడ్జెట్ ఆధారం గా అంచనా వేస్తె , రేపటి కేంద్ర బడ్జెట్ లో తీవ్ర పన్ను పోటు తప్పే అవకాశం లేదని మా అభిప్రాయం. చైనా లో ప్రస్తుతం శిరోభారం గా వున్న అసెట్ బుడగ వంటి పరిస్థితి మన దేశం లో చోటు చేసుకోకుండా ఉండాలంటే , పెరుగుతున్న ద్రవ్యోల్బణం వంటి కీలక సమస్య ని సైతం అరికట్టాలంటే ప్రజల కొనుగోలు శక్తి ని తగ్గించే విధం గా పన్నులను పెంచే అవకాశం కనిపిస్తున్నది. ఉద్దేపనలను వేనుతీసుకోకుండా, ఎక్స్ సైజ్ డ్యూటీ మున్నగు పన్నులు పెంచి బడ్జెట్ లోటు ని తగ్గించే ప్రయత్నం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. బడ్జెట్ లోటు ని తగ్గిస్తే భారత్ రేటింగ్ ని పెంచగలమని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ లు ప్రకటించటం కూడా ఈ సందర్భం లో గమనార్హం. ఇదే జరిగితే మన మార్కెట్ల లో విదేశీ పెట్టుబడులు విశేషం గా తరలి వచ్చే ఆస్కారం ఉంది. కాబట్టి దీర్ఘ కాలిక మార్కెట్లు పడినప్పుడల్లా కొద్ది కొద్ది గా కొనుగోళ్ళు చేయవచ్చు.

  • నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
  • గత ముగింపు: 16256
  • అవరోధాలు: 16340-16486-16527
  • మద్దత్తులు:16252-16191-16124-16064