- మార్కెట్ ముందు చూపు
- ( 22 ఫిబ్రవరి నుండి 26 ఫిబ్రవరి వరకు )
బలహీనం గా గత వారం ముగిసిన మార్కెట్లు , ఈ వారం అత్యంత కీలక సంఘటనల నేపధ్యం లో ట్రేడ్ కానున్నాయి. ఈ గురువారం , ఈ మాసపు చివరి గురువారం కాబట్టి ప్రతిసారి లాగే ఈ సారి గూడా F & O ముగింపు ప్రాముఖ్యత వహించనున్నప్పటికీ , పార్లమెంట్ లో 24 న ప్రవేశపెట్టబోయే రైల్ బడ్జెట్ , 26 న ఆర్ధిక మంత్రి సమర్పించే కేంద్ర బడ్జెట్ మార్కెట్ల్ దృష్తి ని ప్రధానం గా ఆకర్షించ నున్నది. అతి ముఖ్యమైన సంఘటన ల నేపధ్యం లో ఈ వారం ప్రారంభం లో మార్కెట్లు ఎటు తెల్చుకో లేని పరిస్థితి ని ఎదుర్కోనున్నాయి. రైల్ బడ్జెట్ లో ఈ సారి కూడా ప్రయాణికుల పై భారం మోపక పోవచ్చు. ఐతే గూడ్స్ రవాణా పై కొంత మార్పులు తప్పవు కాబట్టి కమాడిటి స్టాకులు కొంత ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. కొత్త రైళ్ళు , రైల్వే భద్రత, పారిశుభ్రత , రైళ్ళ ప్రయాణించే వారికి ఎప్పటికప్పుడు GPRS ద్వారా స్టేషన్ల సమాచారం మరియు సూచనలు , SMS సేవల ద్వారా ప్రయాణికు పై రైల్వే మంత్రి కొన్ని కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉంది .ఇక ప్రధాన బడ్జెట్ పట్ల మార్కెట్లు సందిగ్ధావస్థ లో ఉన్నాయి. ఇన్సురన్సు, బ్యాంకింగ్ రంగాల లో సంస్కరణల పట్ల ఆర్థిక మంత్రి బడ్జెట్ లో ప్రస్తావిస్తే మార్కెట్లకు లాభదాయకం. ఐతే పెరుగుతున్న బడ్జెట్ లోటు ని తగ్గించే దిశగా ఉద్దేపనలను ఉపసంహరించే అవకాశం ఉన్నందున మార్కెట్ల లో bears కూడా అదనుకోసం వేచిచూడ నున్నాయి. పైగా అమెరికా లో ఉద్దేపణలు వేనుతీసుకునే దిశగా అక్కడి ఫేడ్ కసరత్తు చేయటం కూడా మన మార్కెట్ల సెంటిమెంట్ ని గత వారం దెబ్బ తీసింది. ఈ ప్రభావం బడ్జెట్ ప్రకటనల పై రాగల అంచనాలను కూడా ప్రభావితం చేయనున్నాయి. కాబట్టి ఈ వారం మార్కెట్ల దిశ అంచనా వేయటం కష్టం. టెక్నికల్ గా పరిశీలిస్తే సెన్సెస్ నకు 15900 పాయింట్ల స్థాయి అత్యంత కీలకం .ఈ స్థాయి కోల్పోతే సుమారు 15300 వరకు క్షీణించే అవకాశం ఉంది. ప్రస్తుతం సెన్సెక్స్ , 20 రోజుల చలన సగటు , వారం చార్టు ల లో 20 వారాల చలన సగటు కంటే దిగువగా ఉండటం వలన చార్టులు బలహీనం గా ఉన్నాయని చెప్పవచ్చు. నిఫ్టీ నకు 4900-4918-4935 వద్ద తీవ్ర అవరోధం ఉంది. కాగా 4813 -4772- 4755 వద్ద మద్దత్తు ఉంది. నిఫ్టీ నకు 200 రోజుల చలన సగటు 4719 గా మనం పరిగణించ వచ్చు.