- 22-2-2010
- మార్కెట్ నాడి
సుదీర్ఘ సెలవలనంతరం నేడు చైనా, తైవాన్ మార్కెట్లు మరల ట్రేడ్ అవుతున్నాయి. నేడు చైనా మార్కెట్ల మినహా ఇతర ఆసియా మార్కెట్లు స్వల్ప లాభాల తో పయనిస్తూ ఉండటం విశేషం. గత శుక్రవారం అమెరికా మార్కెట్లు స్వల్పంగా పెరిగిన ద్రవ్యోల్బణం కారణం గా ఫ్లాట్ గా ముగిసాయి. గత రెండు రోజులు గా భారి నష్టాల ను చవిచూసిన ఆసియా మార్కెట్ల లో నేడు చోటు చేసుకుంటున్న స్వల్ప పుల్ బ్యాక్ ర్యాలి వలన కొంత లాభాల తో పయనిస్తున్నాయి.
మన మార్కెట్ల పరం గా నేడు ఆసియా మార్కెట్లను అనుసరించి కొంత పుంజుకునే అవకాశం ఉంది. ఐతే నేడు స్టాకు ల పరం గా మదుపర్లు ఆసక్తి కమపరిచే అవకాశం ఉంది. భారతి అయిర్ టెల్ , గల్ఫ్ నకు చెందిన జ్జెన్ టెలికాం తో ఆఫ్రికా లో సేవలనుందించే నిమిత్తం ఒప్పందం ఖరారు చేసుకోవటం , రిలయన్స్ గ్రూపు fame india లో 62 % వాటా కొనుగోలు కై ఆసక్తి కనపరచటం, రేణుక షుగర్స్ బ్రజిల్ దేశానికి చెందిన Equipav లో 51 % వాటా కొనుగోలు చేయటం మున్నగు అంశాలు ఈ కౌంటర్ లను ప్రభావితం చేయనున్నాయి.
కాగా స్థూలం గా దేశ పరిస్థితి గురించి చర్చిస్తే, దేశం లో చెక్కర మరియు బియ్యం కొరత అంచనాల ను మించటం తో అత్యవసరం గా దిగుమతులు చేసుకోవాలని ప్రధాన మంత్రి సలహా మండలి సిఫారుసు చేయటం గమనార్హం. ఈ కారణం గా రానున్న రోజుల లో చెక్కర ధరలు మరింత గా పెరిగే అవకాశం ఉంది . ఈ అంశం వలన చెక్కర స్టాకు ల లో కొంత చలనం కనపడే అవకాశం ఉంది. అదే విధం గా ఆర్ధిక మంత్రి ప్రకటించ బోయే బడ్జెట్ తాలూకు విశేషాలు / స్పష్టీకరణ లు కూడా మార్కెట్లను ప్రభావితం చేయనున్నాయి
నేడు ఆసియా మార్కెట్లను అనుసరించి మార్కెట్లు స్వల్ప లాభం తో ప్రారంభమయినప్పటికీ, మధ్యాన్నం తదుపరి ఐరోపా మార్కెట్ల దిశ మన మార్కెట్ల ను ప్రభావితం చేయనున్నాయి. ముఖ్యం గా బ్రిటిన్ ఆర్ధిక మాంద్యం లో మరింత గా కూరుకుపోయే వార్తలు వినవస్తున్నందున ఐరోపా మార్కెట్ల గమనం మన మార్కెట్లకు కీలకం
- నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
- గత ముగింపు: 16191
- అవరోధాలు: 16226-16340-16496
- మద్దత్తులు:16124-16064-15957