• 22-2-2010
  • మార్కెట్ రిపోర్ట్
ఉదయం మా అంచనాలకి అనుగుణం గా నేడు శుభారంభం చేసిన మార్కెట్లు ఐరోపా మార్కెట్ల లో ని బలహీనత కారణంగా లాభాలను విసర్జించి ఫ్లాట్ గా ముగిసాయి. దీనితో సెన్సెక్స్ కేవలం 45 పాయింట్ల స్వల్ప లాభం తో 16237 పాయింట్ల వద్ద ముగియగా , నిఫ్టీ 11 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ నేడు పాయింట్ల వద్ద 4856 ముగిసింది.
నేటి ట్రింగ్ లో సెన్సెక్స్ 0.28 % , నిఫ్టీ 0.24% లాభపడగా, మిడ్ క్యాప్ రంగం 0.59 %, స్మాల్ క్యాప్ రంగం 1.05 % మేరకు నష్టాలను చవిచూసాయి. నేడు సేక్టోరల్ సూచీ ల లో రియాలిటీ సూచీ మరొక సారి bears పంజా కి బలి అయ్యింది. ఈ రంగం అత్యధికం గా 1.77 % కోల్పోయింది. కాగా కన్సుమేర్ డ్యురబుల్స్ 1.04 % నష్టపోయింది. నేడు ఐ. టి ఇండెక్స్ అత్యధికం గా 1.01 % లాభపడగా , లండన్ మెటల్స్ ఎక్స్చేంజ్ లో మెటల్స్ లాభపడటం తో మన మార్కెట్ల లో కూడా లోహాల సూచీ లాభపడి 0.68 % పెరిగింది.
నేడు రాష్ట్ర పతి ప్రతిభా పాటిల్ పార్లమెంట్ ఉభయ సభ ల ను ఉద్దేశిస్తూ చేసిన ప్రసంగం లో సామాన్య మానవుడి ( అం ఆద్మీ ) ప్రయోజనాలను కాపాడే విధం గా ఆహార ధాన్యాల ధరలను తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని సూచిస్తూ , దేశం లో అభివృద్ధి 7.5 % చేరుకుంటుందని ప్రకటించారు.
స్టాకు ల పరంగా నేడు బోనస్ ఇష్యూ ప్రకటించ నున్న వార్త తో cadila health care సుమారు 2 % ఎగబాకింది. కాగా ఇమామి ఆహార పానియాల రంగం లో ఆరం గేట్రం చేయనున్నట్లు ప్రకటించటం తో 2.57 % లాభపడింది. మేము ఉదయం సూచించిన కారణం గా నేడు రేణుక షుగర్స్ 3.70 % లాభపడటం విశేషం
సెన్సెక్స్ స్టాకు ల ను పరిశీలిస్తే హిందాల్కో 2.6 %, HUL 1.7 % లాభపడగా DLF 2.1 %, గ్రాసిం 1.4 % మేరకు క్షీణించింది.