- 23-2-2010
- మార్కెట్ నాడి
గత రాత్రి అమెరికా మార్కెట్లు దిశా హీనం గా పయనించి స్వల్ప నష్టాల తో ముగిసాయి. ఈ కారణం గా నేడు ఆసియా మార్కెట్ల లో గత రెండు మూడు రోజులుగా కొనసాగుతున్న బుల్ల్స్ హవా కి బ్రేక్ పడింది. నేడు ఆసియా మార్కెట్లన్నీ కూడా ప్రాఫిట్ బుకింగ్ కి గురవుతున్నాయి . ముఖ్యం గా మెటల్స్ , బంగారం, ఆయిల్ మరియు ఇతర కమో డి టి ల లో బలహీనత కనిపిస్తున్నందున ఆసియా మార్కెట్లు సుమారు 1 % నష్టపోతున్నాయి.
మన మార్కెట్ల పరం గా యోచిస్తే, నిన్న రాష్ట్ర పతి ఆహార భద్రత విషయం లో ప్రత్యెక శ్రద్ధ కనపరచాలని పార్లమెంట్ కి పిలుపునివ్వటం వలన అగ్రీ స్టాకు ల కు ఈ బడ్జెట్ లో ప్రాధాన్యత పెరిగే అవకాశం మెరుగయ్యింది. ఇది ఇలా ఉండగా , అంతర్జాతీయ రేటింగ్ ఏజెంసి మూడి , భారత్ ,తన బడ్జెట్ లోటు ని తగ్గించుంటే భారత్ రేటింగ్ ని పెంచనున్నట్లు ప్రకటించటం మన మార్కెట్లకు కొంత ఊరట కలిగించే అంశం . ఇది ఇలా ఉండగా మన దేశ బడ్జెట్ లోటు 5.5 % ఉండగలదని, GDP వృద్ధి 6.8 % ఉండగలదని ప్రధాని ఆర్ధిక సలహా దారుడు రంగరాజన్ ప్రకటించటం ఈ నేపధ్యం లో కీలకం. బడ్జెట్ లోటు కన్నా అభివృద్ధి శాతం అధికం గా ఉంటె పెద్ద ప్రమాదం కాదని , ఐతే దీర్ఘ కాలం లో ఇదే విధం గా కొనసాగితే ద్రవ్యోల్బణం అతి దారుణం గా పెరుగుతుందని నోబెల్ ప్రైజ్ గ్రహీత , స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆండ్రీవ్ స్పెన్స్ ప్రకటించటం గమనార్హం. ఇది ఇలా ఉండగా S & P , మరియు FITCH భారత రేటింగ్ ని BBB- వద్ద కొనసాగించాలని చేయాలని యోచిస్తోంది.
ఏది ఏమైనప్పటికీ అంతర్జాతీయ సంస్థలే కాక మన మార్కెట్లు కూడా 26 న ఆర్ధిక మంత్రి విడుదల చేయనున్న బడ్జెట్ పై అంచనాల తో సతమతమయ్యే అవకాశం ఉంది
- నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
- గత ముగింపు: 16237
- అవరోధాలు: 16252-16340-16486-16527
- మద్దత్తులు:16226-16124-16064