• 2-2-2010
  • మార్కెట్ నాడి

పెరుగుతున్న నిరుద్యోగ రేటును కట్టడి చేసే దిశగా 3.83 ట్రిలియన్‌ డాలర్ల బడ్జెట్‌ను , గత రాత్రి , కాంగ్రెస్‌ ముందు యుఎస్‌ అధ్యక్షుడు ఒరాక్‌ ఒబామా ప్రవేశపెట్టారు. ప్రభుత్వ కార్యక్రమాలకు నిధులు లభ్యతను కఠినం చేస్తూ, సంపదపై పన్నులను పెంచుతూ కీలక నిర్ణయాలను తీసుకున్నప్పటికీ లోటు అత్యధిక స్థాయిలో 1.56 ట్రిలియన్‌ డాలర్లకు చేరింది. ఐతే అంచనాలను మించి ఉత్పత్తి గణాంకాలు నమోదు కావటం తో అమెరికా మార్కెట్ల లో బుల్ల్స్ హవా కొనసాగింది. కామోడిటి లు కూడా భారి గా లాభాలను ఆర్జించటం తో ట్రేడింగ్ గరిష్ట స్థాయి లో అక్కడి స్టాక్ మార్కెట్లు ముగిసాయి.

సానుకూల అమెరికా మార్కెట్ల ప్రభావం తో నేడు ఆసియా మార్కెట్లు కూడా లాభాలతో పయనిస్తున్నాయి.

మన మార్కెట్ల పరం గా విశ్లేషిస్తే, మన దేశ ఉత్పత్తి గణాంకాలు కూడా 18 నెలల గరిష్ట స్థాయిలో నమోదు కావటం కొంత ఆశాజనకం. పైగా ఎగుమతుల లో కూడా వృద్ధి నమోదు కావటం కూడా దేశ ఆర్ధిక పరిస్థికి శుభసూచకం. ఐతే పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ముఖ్యం గా పెరుగుతున్న ఆహారా ధాన్యాల ధరల పట్ల ప్రధాన మంత్రి ఆందోళన వ్యక్తం చేయటం గమనార్హం. పెరుగుతున్న జీతాల కారణంగా ఆహార ధాన్యాల ధరల పై వత్తిడి పెరుగుతున్నట్లు ఆయన ప్రకటించారు . ఐతే పెరుగుతున్న ద్రవ్యోల్బణం, రాగల బడ్జెట్ లో లోటు ని నియంత్రించక పొతే భారత్ రేటింగ్ ని దిగజార్చవలసి వస్తుందని అంతర్జాతీయ రేటింగ్ సంస్థ FITCH ప్రకటించటం ఈ నేపధ్యం లో గమనార్హం .ప్రస్తుతానికి ఈ సంస్థ భారత్ దేశపు రేటింగ్ ని BBB- వద్ద స్థిరం గా ఉంచింది. ఇది ఇలా ఉండగా , భారత ఆర్ధిక వ్యవస్థ మెరుగు పడుతున్న కారణం గా , ఈ బడ్జెట్ లో ఉద్దేపనల అవసరం ఉండబోదని , ప్రభుత్వం ఇటువంటి ప్యాకేజీలకు ,రాగల బడ్జెట్ లో స్వస్తి పలకవచ్చని రిజర్వు బ్యాంక్ గవర్నర్ తమ అభిప్రాయాన్ని తెలిపారు. ఈ అంశాలని బేరీజు వేస్తె, రాగల బడ్జెట్ పై ఆహార ధ్యాన్యాల ఉత్పత్తి పై ప్రత్యెక శ్రద్ధ కనపరచటమే కాక బడ్జెట్ లోటు , ఉద్దిపనల పై ప్రభుత్వం ఆచీ తూచి వ్యవహరించే అవకాశం ఉందని అంచనా వేయవచ్చు . రాగల బడ్జెట్ పై క్రేమేపి మరిన్ని అంచనాలు వెల వడే అవకాశం ఉన్నందున మదుపరులు ఈ అంశాల పై నిరంతరం దృ ష్టి నిలపటం లాభదాయకం.

సానుకూల మైన ప్రపంచ మార్కెట్ల నేపధ్యం లో నేడు మన మార్కెట్లు గ్యాప్ అప్ తో శుబారంభం చేయనున్నాయి.

  • నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
  • గత ముగింపు: 16356
  • అవరోధాలు: 16477-16527-16606-16765
  • మద్దత్తులు:16340-16252 -16124-16064