• 01-2-2010
  • మార్కెట్ నాడి
నేడు మన మార్కెట్లు మిశ్రమ ఫలితాలతో ముగిసింది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి ఒడిదుడుకులను ఎదుర్కొన్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ కేవలం ఒక పాయింట్ నష్టంతో, 16,356 పాయింట్ల వద్ద ముగిసింది. అయితే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ 17 పాయింట్లు పుంజుకుని, 4899 పాయింట్ల వద్ద నిలిచింది. విదేశీ మార్కెట్ల ప్రభావంతో లాభ, నష్టాలతో మిశ్రమ ఫలితాల్లో ర్యాలీని కొనసాగించిన సెన్సెక్స్, నిఫ్టీలు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి స్వల్ప లాభ, నష్టాలతో ముగిశాయి.
ఇంకా యూరప్, ఆసియా మార్కెట్లు లాభదాయకంగా కొనసాగడం, మదుపుదారులు కొనుగోళ్లపై దృష్టి మళ్లించడం వంటి కారణాలతో బాంబే స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప లాభ, నష్టాలను నమోదు చేసుకున్నాయి.
నేటి ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ రంగం 1.81 శాతం, స్మాల్ క్యాప్ రంగం 2.72 శాతం లాభాలను నమోదు చేసాయి.
నేటి ట్రేడింగ్ లో కన్సుమేర్ డ్యురాబుల్స్ ఇండెక్స్ అత్యధికం గా 5.77 శాతం లాభపడగా , హెల్త్ కేర్ సూచీ 2.55 శాతం ఎగబాకింది. కాగా నేడు FMCG 0.66 % , ఐ.టి ఇండెక్స్ 0.01 % మేరకు నష్టపోయాయి.
సెన్సెక్స్ స్టాకు ల లో మేము నేటి ఉదయమే అంచనా వేసిన విధం గా హిందూస్తాన్ యూని లివేర్ అత్యధికం 2.87 % నష్టపోయింది. కాగా SBI 1.79 % నష్టపోయింది. నేడు టాటా మోటర్స్ 3.56 % విప్రో 3.13 % మేరకు లాభపడ్డాయి.