• 18-2-2010
  • మార్కెట్ నాడి

పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాలు , నూతన గృహ నిర్మాణ గణాంకాలు అంచనాలను మించి అధికం గా నమోదుకావటం తో గత రాత్రి అమెరికా మార్కెట్ల లో భారి ర్యాలి చోటు చేసుకున్నది. ఐతే ఆసియా మార్కెట్ల లో గత కొన్ని రోజులుగా చోటు చేసుకున్న ర్యాలి అనంతరం నేడు స్వల్ప ప్రాఫిట్ బుకింగ్ కి లోనుకావటం తో తీవ్ర ఒడి దుడుకులను ఎదురుకుంటున్నాయి . కొమోడిటి ల లో ముఖ్యం గా మెటల్స్ మరియు ముడి చమురు నష్టాలను ఎదురుకుంటున్నాయి. IMF తమ వద్దనున్న బంగారం నిలువల లో 191 టన్నుల మేరకు బంగారాన్ని ప్రపంచ విపణుల లో విక్రయించాలని చేసిన యోచన కూడా బంగారం ధరల పతనం కి కారణమవుతున్నాయి.

ఇక మన దేశం లో చోటు చేసుకున్న ముఖ్య విశేషాలను మార్కెట్ల పరంగా అన్వయించు కుంటే , వ్యవసాయ మంత్రి - ఆహార ధాన్యాల ధరలు అతి త్వరలో తగ్గు ముఖం పట్టనున్నాయని భరోసా ఇవ్వటం కొంత ఊరట కలిగించే అంశం . అయితే ఆర్ధిక మంత్రి ప్రనాబ్ ముఖర్జీ , మార్చ్ నాటికి ద్రవ్యోల్బణం 10 % పై నే కోనసాగ గలదని , ఈ అంశం విచారకరమని ప్రకటించటం మార్కెట్ల సెంటిమెంట్ ని దెబ్బతీసే విధం గా ఉంది. ఇది ఇలా ఉండగా, REUTERS జరిపిన అధ్యయనం ప్రకారం ఏప్రిల్ తదుపరి ప్రభుత్వం ఉద్దిపణలు వేనుతీసుకునే అవకాశం ఉందని వెల్లడించింది. ఐతే విదేశీ పెట్టుపడులను భారత్ మార్కెట్ల లో కి ఆహ్వానించే విధం గా చర్యలు చేపట్టే అవకాశం ఉందని , బడ్జెట్ లోటు లో 27500 కోట్ల రూపాయలను ప్రభుత్వ వాటాల ఉపసంహరణ ద్వారా సమీకరించే అవకాశం ఉందని తేల్చిచెప్పింది.

బడ్జెట్ అంచనాలు ఊపందుకోవటం వలన మన మార్కెట్లు స్టాకు ల పరం గా ముందంజ వేసే అవకాశం ఉంది. ఆసియా మార్కెట్ల ధోరణి లో నే మన మార్కెట్లు కూడా కొంత ఆటు పొట్ల కి గురి అయ్యే అవకాశం లేకపోలేదు .

  • నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
  • గత ముగింపు: 16429
  • అవరోధాలు: 16486-16527 -16606-16765
  • మద్దత్తులు:16340-15252-16124-16064-