- 17-2-2010
- మార్కెట్ రిపోర్ట్
సానుకూల ఆసియా మార్కెట్ల ప్రభావం వలన శుభారంభం చేసిన మార్కెట్లు ఆద్యంతం లాభాల లో పయనిచాయి. దీనితో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 202 పాయింట్లు లాభపడి 16429 పాయింట్ల వద్ద ముగిసింది. కాగా నిఫ్టీ 58 పాయింట్ల లాభం తో 4914 పాయింట్ల వద్ద ముగిసింది. ఒక స్థాయి లో గరిష్ట స్థాయి 16481 సెన్సెక్స్ పాయింట్ల నుండి కొంత మేరకు ప్రాఫిట్ బుకింగ్ చోటు చేసుకున్నప్పటికీ ఐరోపా మార్కెట్లు కూడా లాభాల తో పయనించటం తో మన మార్కెట్ల లో లాభాల పరంపర కొనసాగింది. రబీ పంట మార్కెట్ల లో కి చేరుకుంటున్నందున , ఇంకా ప్రభుత్వం చేపట్టిన చర్యల వలన ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టగలదని ఆర్ధిక మంత్రి ప్రనాబ్ ముఖేర్జీ తెలియచేయటం కూడా మార్కెట్లు లాభపడేందుకు తోడ్పడింది.
నేటి ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ రంగం 0.79 శాతం, స్మాల్ క్యాప్ రంగం 0.61 శాతం లాభపడ్డాయి.
నేడు సేక్టరాల్ ఇండెక్స్ ల లో కన్సుమేర్ డ్యుర బుల్స్ 3.34 %, మెటల్స్ 3.24 % మేరకు లాభపడ్డాయి..కాగా రియాలిటి సూచీ 1 %, ఐ. టి 0.22 % నష్టాలను చవిచూసాయి. ఫండ్స్ కొనుగోళ్ళ కారణం గా బజాజ్ ఆటో ఫైనాన్స్ 4.62 % లాభపడింది. కాగా అరేవ T & D రూ. 120 కోట్ల ఆర్డర్లు పొందటం తో 4 % వృద్ధి పొందింది. Q4 ఫలితాల లో 12.8 % లాభల లో క్షీణత నమోడుకావటం వలన ఈ కౌంటర్ 4 % నష్టపోయింది. థింక్ సాఫ్ట్ వరుసగా రెండవ రోజు 20 % కనిష్ట సర్క్యూట్ నమోదు చేసింది.
సెన్సెక్స్ స్టాకు ల లో DLF 1.34 % ,ఇన్ఫోసిస్ 0.62 % నష్టపోయాయి. కాగా టాటా స్టీల్ 6.37 %, హిందాల్కో 5.20 % ఎగబాకి సెన్సెక్స్ వృద్ధి కి తోడ్పడ్డాయి.