• 11-2-2010
  • మార్కెట్ రిపోర్ట్

సానుకూల ప్రపంచ మార్కెట్ల నేపధ్యం లో మన మార్కెట్లు ఆద్యంతం లాభాల బాట లో నడిచాయి. మార్కెట్ల లో చోటు చేసుకున్న షార్ట్ కవేరింగ్ కూడా నేడు మన మార్కెట్లు బలపెడేందుకు కారణమయ్యింది. దీనితో సెన్సెక్స్ నేటి ట్రేడింగ్ లో 230 పాయింట్లు ఎగబాకి 16153 పాయింట్ల వద్ద ముగియగా, నిఫ్టీ 70 పాయింట్ల లాభం తో 4827 పాయింట్ల వద్ద ముగిసింది. పెరిగిన ఆహార ద్రవ్యోల్బణం సైతం మార్కెట్ల సెంటిమెంట్ పై ప్రతికూల ప్రభావం చూపలేక పోయింది. జనవరి 30తో ముగిసిన వారాంతానికి ఆహార ద్రవ్యోల్బణం మరికాస్త పెరిగి 17.94 శాతానికి చేరుకుంది. అదే అంతకు మునుపటి వారాంతానికి ఆహార ద్రవ్యోల్బణం 17.56 శాతంగాఉండింది. విదేశీ పెట్టు బడుల పై క్యాబినెట్ తీసు కున్న సానుకూల నిర్ణయం మార్కెట్లు లాభాలకు కారణమయ్యింది. నేటి ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ , స్మాల్ క్యాప్ రంగాలు 8 % చొప్పున లాభపడ్డాయి. కాగా నేడు అన్ని సెక్టోరల్ రంగాలు లాభాల ను గడించటం విశేషం . నేడు ఆటో ఇండెక్స్ అత్యధికం గా 2 .14 % లాభపడగా , చమురు మరియు గ్యాస్ రంగం 2.06 % లాభపడింది. నేడు రిజర్వు బ్యాంక్ , గృహ రుణాల లో వడ్డీ తగ్గింపు కేవలం కొత్త గృహాలకే పరిమితం చేయక పాత రుణాలకు కూడా వర్తింపచేయాలని బ్యాంకులను సూచించటం తో నేడు unitech, hdil , dlf, మున్నగు బీటా స్టాకులు లాభ పడ్డాయి. కాగా నార్వే కి చెందిన టెల్నార్ ,యూనిటెక్ వైర్లేస్స్ లో వాటా పెంచనున్నట్లు ప్రకటించటం కూడా unitech లాభ పడేందు కు కారణమయ్యింది. కమాడిటీలు బలపడటం తో నేడు మెటల్స్ స్టాకులు కూడా లాభాలను ఆర్జించాయి.GDR విడుదల చేసేందుకు ఆమోదం లభ్యమవ్వటం తో నేక్టార్ లైఫ్ సైన్స్ కూడా లాభాలను గడించింది. పెట్రోల ధరలను ప్రస్తుతానికి ప్రభుత్వం పెంచకపోవటం తో ఆయిల్ మార్కెటింగ్ కంపనీలు నష్టపోయాయి . ఇక సెన్సెక్స్ స్టాకు లను పరిశీలిస్తే నేడు కేవలం భారతి అయిర్ టెల్ , టాటా పవర్ మాత్రమె నష్టపోయాయి, ఈ వాటా లు 0.29 % ,0.78, శాతం చొప్పున నష్టపోయాయి. కాగా నేరో హోండా 4.93 %, జై ప్రకాష్ 3.51 శాతం మేరకు లాభపడ్డాయి.