- 11-2-2010
- మార్కెట్ నాడి
గత రాత్రి అమెరికా ఫెడ్ అధ్యక్షులు బెర్నంకే విడుదల చేసిన ప్రకటన లో అక్కడి బ్యాంకులకు , రిజర్వు మీద చెల్లించే వడ్డీ రేటు ని మార్పుచేయనున్నట్లు ప్రకటించటం, డిసెంబర్ నకు చెందిన వాణిజ్య లోటు తీవ్రతరం కావటం మున్నగు అంశాల నేపధ్యం లో అమెరికా మార్కెట్లు మిశ్రమంగా ముగిసాయి.
బ్లూమ్బెర్గ్ జరిపిన సర్వే ప్రకారం మదుపర్ల లో , గ్రీస్ సంక్షోభం వలన స్థ్యైర్యం సన్నగిల్లిందని వెల్లడయ్యింది. కాగా నేడు గ్రీస్ ని గట్టెక్కించే ప్రయత్నం లో భాగం గా జర్మనీ కీలక నిర్ణయం ప్రకటించ నున్నది . నేడు ఆస్ట్రేలియా లో విడుదలయిన నిరుద్యోగ గణాంకాలు అందరిని ఆశ్చర్య పరుస్తూ తగ్గుదల నమోదు కావటం తో అక్కడి మార్కెట్లు లాభాలో పయనిష్టున్నాయి. ఈ మిశ్రమ సంకేతాల నేపధ్యం లో నేడు ఆసియా మార్కెట్లు ఫ్లాట్ గా ట్రేడ్ అవుతున్నాయి.
మన దేశం లో నేడు కాబినెట్ పెట్రోల్ ధరల పెంపున పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పెట్రోల్ ధరలు పెంచి తీరవలసిన దే అని పెట్రోల్ మంత్రిత్వ శాఖ పట్టుపడుతోంది. ప్రభుత్వం ప్రకటించే తుది నిర్ణయం పై మన మార్కెట్లు ప్రధానం గా ఆధార పడనున్నాయి. పెట్రో ధరలు పెంచితే ఆయిల్ మార్కెటింగ్ కంపనీలు నేటి ట్రేడింగ్ లో కొంత మేరకు పుంజుకునే అవకాశం ఉంది. కేంద్ర బడ్జెట్ లో ధరల పెంపుదలను ప్రతిపాదించ కుండా , ముందుగానే ధరలను పెంచి , బడ్జెట్ లో కేవలం జనరంజక అంశాలనే ప్రస్తావించటం గత కొన్ని సంవత్సరాలు గా జరుగుతున్నది కాబట్టి నేడు కాబినెట్ పెట్రో ధరలను కొంత పెంచే అవకాశం ఉంది. ఐతే ఇప్పటికే పెరుగుతున్న ద్రవ్యోల్బణం శిరోభారం గా తయారవుతున్నందున పెట్రోల్ ,గ్యాస్ ధరల ను పెంచితే ద్రవ్యోల్బణం మరింతగా పెరగనున్నది. ఈ విధం గా పెరిగిన ద్రవ్యోల్బణం ని అరికట్టేందుకు రిజర్వు బ్యాంక్ కీలక వడ్డీ రేటు ని పెంచవలసి వస్తుంది. కాబట్టి నేడు కాబినెట్ తీసుకునే నిర్ణయం పై మదుపరులు ప్రత్యేక దృష్టి పెట్టటం మంచిది.
నేడు విడుదల కానున్న ద్రవ్యోల్బణ గణాంకాలు కూడా ఈ అంశం పై కొంత అవగాహన కలిపించ వచ్చు.
సుదీర్ఘ వారంతం కనుక నేడు ట్రే డెర్ లు తమ పోజిషన్లు తగ్గించుకునే ప్రయత్నం చేయవచ్చు. ఏది ఏమైనప్పటికీ నేడు మార్కెట్లు ఆటు పాట్లకి గురికాక తప్పదు
నేటి ట్రేడింగ్ లో 19831 అత్యంత కీలక మాదత్తు. ఇది వీగి పొతే మరింత దిద్దుబాటు కు మార్కెట్లు లోనయ్యే ప్రమాదమున్నదని గుర్తించాలి.
( గమనిక : సుదీర్ఘ వారంతం నేపధ్యం లో వెబ్సైటు maintenence పనులు జరపనున్నాము. కాబట్టి వారంతం లో మా సేవలు ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. చదువరులు సహకరించ వలసినదిగా కోరుతున్నాము. )
- నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
- గత ముగింపు: 15922
- అవరోధాలు: 15957- 16064-16124
- మద్దత్తులు:15831-15660-15553