• 1-2-2010
  • మార్కెట్ నాడి

గత శుక్రవారం అద్బుతమైన GDP వృద్ధి రేటు ని నమోదు చేసినప్పటికీ, నిరుద్యోగ సమస్య తీవ్ర తరం కావటం తో అమెరికా మార్కెట్లు లాభాల నుండి నష్టాల లో పయనించాయి . కాగా అమెరికా బడ్జెట్ పై కూడా మార్కెట్లు కించిత్ నిరుత్సాహ ధోరణి అవలంభించటం వలన అమెరికా మార్కెట్లు నష్టాలను నమోదు చేసాయి.

నేడు అమెరికా ప్రెసిడెంట్, అక్కడ ప్రవేశ పెట్ట నున్న బడ్జెట్ నేపధ్యం లో మదుపర్లు అప్రమత్త ధోరణి ని కనపరుస్తున్నారు. ఇది ఇలా ఉండగా , ప్రపంచం లో ఆర్ధిక మాంద్యం రాగలదని మొట్టమొదటిసారిగా ముందే పసిగట్టిన న్యూ యార్క్ ప్రొఫెసర్ నుయల్ రుబని , అమెరికా , ఈ సంవత్సరపు ద్వితీయార్థం నుండి కష్టాల పాలు కానున్నదని, పరిస్థితి ఆశాజనకం గా ఉండబోదని జోస్యం చెప్పటం ఈ నేపద్యం లో కీలకం. కాగా యూరో జోన్ లో గ్రీక్ దేశం కూడా అస్థిరత కి లోనయ్యే ప్రమాదం ఉండటం కూడా ప్రపంచ మార్కెట్ల సెంటిమెంట్ ని దెబ్బతీస్తోంది. బలహీనమైన వాల్ స్ట్రీట్ ట్రేడింగ్ వలన ,నేటి ఆసియా మార్కెట్లు కూడా తీవ్ర నష్టాల తో పయనిస్తున్నాయి.

మన మార్కెట్ల పరంగా యోచిస్తే, గత శుక్రవారం రిజర్వు బ్యాంక్ CRR ని పెంచింది .రిజర్వు బ్యాంక్ చర్య వలన సంవత్సరపు SWAP RATE పెరగనున్నది . రిజర్వు బ్యాంక్ ప్రకటన పట్ల మన మార్కెట్లు , F & o ముగింపు కారణం గా పూర్తి గా , తమ ప్రతిక్రియ ని చూపలేక పోయాయి . కాగా నేటి బలహీనమైన ఆసియా మార్కెట్ల నేపద్యం లో మన మార్కెట్ల కి ఒక అవకాశం కలిగినట్లు మనం అంచానా వేయవచ్చు.

  • నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
  • గత ముగింపు: 16357
  • అవరోధాలు: 16477-16527-16606-16765
  • మద్దత్తులు:16340-16252 -16124-16064-15957