• మార్కెట్ ముందుచూపు
  • (1-2-2010 నుండి 5-2-2010 వరకు )

ప్రపంచ మార్కెట్లకు అనుసంధానం గా మన మార్కెట్లు గత వారం భారి గా నష్టపోయాయి. పతాక స్థాయి అయిన 17790 పాయింట్ల నుండి సుమారు 10 % దిద్దుబాటుకు సెన్సెక్స్ గత వారం గురి అవ్వటం తో బుల్ల్స్ పలాయనం చిత్తగించాయి. నిఫ్టీ సైతం ఈ దిద్దుబాటు లో 154 పాయింట్లు నష్టపోయింది .

ఇప్పటివరకు 146 కంపనీలుతమ Q 3 ఫలితాలు వెల్లడి చేసాయి . సగటున ఈ కంపనీలు తమ లాభాలను 38 % మేరకు పెంచుకున్నాయి. కాని ఈ సానుకూల ప్రభావం మార్కెట్ల పై ఎక్కువ గా నిలవలేక పోయింది. గత శుక్రవారం రిజర్వు బ్యాంక్ ద్రవ్య పరపతి విధానం ప్రకటించింది. CRR రేటు ని 75 బేసిస్ పాయింట్లను పెంచటం తో మార్కెట్లు కనిష్ట స్థాయికి పడిపోయాయి. పైగా రిజర్వు బ్యాంక్ , ద్రవ్యోల్బణం కూడా 6.5 నుండి 8.5 వరకు పెరగ గలదని అంచనా వెల బుచ్చింది. . దీనితో మార్కెట్ల లో లిక్విడిటి తగ్గనుంది. పైగా విదేశీ సంష్టాగత మదుపర్లు కూడా గత వారం మన మార్కెట్ల నుండి 7000 కోట్ల రూపాయలను ఉపసంహరించారు. దీనితో సెన్సెక్స్ 16 వెల పాయింట్ల కంటే దిగువ కి చేరగా, నిఫ్టీ 4770 పాయింట్ల కీలక మద్దత్తు ని సమీపించింది. ఐతే జనవరి F & O ముగింపు నేపధ్యం లో చోటు చేసుకున్న షార్ట్ కవేరింగ్ మార్కెట్ల కు కొంత ఊరట కలిగించింది. ఐతే జనవరి రోల్ ఓవర్ల లో లాంగ్ పోజిషేన్లు UNWINDING జరగటం తో సెన్సెక్స్ ఈ వారం 502 పాయింట్ల నష్టానికి గురి అయ్యింది. పైగా మిడ్ క్యాప్ , స్మాల్ క్యాప్ రంగాలు కూడా భారి నష్టాలను చవి చూడటం తో మార్కెట్ల లో ర్యాలి కి అతి త్వరలో విరామం కలిగే అవకాశం ఉంది. ఐతే ఈ నేపధ్యం లో ఒక కీలక అంశం గుర్తించాలి. గత జూన్ - జూలై లో మార్కెట్లు 15 % , అక్టోబర్ – నవంబెర్ లో 12 % మేరకు దిద్దుబాటు కి గురి అయ్యింది. కాబట్టి కీలక మద్దతు స్థాయిలు నిలబడక పొతే , మార్కెట్లు రానున్న రోజుల లో మరికొంత క్షీణించే అవకాశం ఉంది. వారం మార్కెట్లను ప్రభావితం చేయగల అంశాలను పరిశీలిస్తే, NTPC FPO మార్లేట దృష్టి ని ప్రధానం గా ఆకర్షించ నున్నది. అదే విధం గా ప్రభుత్వం 3G వేలం ప్రక్రియ ని వాయిదా వేసింది. దీనితో , ఈ వేలం ద్వారా సమకూర్చుకోదలచిన 35000 కోట్ల రూపాయల మేరకు ఆదాయం లో లోటు కనవస్తుంది. ఈ అంశం ఫెబ్రవరి 26 న పార్లమెంట్ లో ప్రవేశ పెట్టబోయే బడ్జెట్ పై ప్రతికూల ప్రభావం చూపెట్ట ను న్నది. మిగలిన స్వల్పకాలం లో ప్రభుత్వం ప్రత్యామ్నాయ పద్దతి ద్వారా ఈ బడ్జెట్ లోపల 35000 కోట్ల ఆదాయం ని సమకూర్చటం దుర్లభం. ఈ అంశం కూడా మార్కెట్ల ను ప్రభావితం చేయవచ్చు. అంతర్జాతీయ విపణులు కూడా ప్రస్తుతం దిద్దుబాటు ధోరణి ల లో పయనిస్తున్నాయి. CRB ఇండెక్స్ ల లో దిద్దుబాటు కనపడటం తో కమోడిటిలు కూడా రానున్న రోజుల ల లో మరింత క్షీణత కి గురి అయ్యే అవకాశం ఉంది. టెక్నికల్ గా పరిశీలిస్తే , డైలీ ఆసిలేటర్లు మార్కెట్లు పెరిగే అవకాశం ఉందని సూచిస్తున్నాయి . కాబట్టి మార్కెట్ల ల లో , ఈ వారం కొంత పుల్ బ్యాక్ ర్యాలి చోటు చేసుకునే అవకాశం ఉంది. ఐతే మార్కెట్లు మరింత గా పెరగాలంటే కీలక నిరోధ మైన 17002 పాయింట్లను ఛేదించటం ముఖ్యం . ప్రస్తుతానికి సెన్సెక్స్ 50 రోజుల చలన సగటు కంటే దిగువన ముగియటం తో మార్కెట్ల లో సమీప కాలం లో బలహీనత కే ఎక్కువ ఆస్కారాలు ఉన్నాయి. మార్కెట్లు క్షీణిస్తే 15554 ,15330 స్థాయిలు అత్యంత కీలకం. మార్కెట్లు భారి దిద్దుబాటు కి గురి అయితే 14867 ఫిబినొకి పాయింట్ల వద్ద మద్దతు తీసుకునే అవకాశం ఉంది.

మార్కెట్లు ఈ వారం ప్రధానం గా 16000 - 16700 పాయింట్ల మధ్య ఆటుపోట్లకి గురి అయ్యే అవకాశం ఉంది. ఈ వారం సెన్సెక్స్ నకు 16252 తక్షణ మద్దతు స్థాయి. కాగా , 16527 తక్షణ అవరోధస్థాయి.17002 వద్ద కీలక అవరోధం ఉంది. కాగా 15853 కీలక మద్దతు స్థాయి. ఈ మద్దతు కోల్పోతే , ముందుగా చర్చించిన స్థాయిలు ప్రధాన పాత్ర పోషించ నున్నాయి.