25-1-2010
- మార్కెట్ రిపోర్ట్
అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం బాంబే స్టాక్ మార్కెట్‌పై పడింది। ట్రేడింగ్ ప్రారంభంలోనే నష్టాలతో కూరుకుపోయిన బాంబే స్టాక్ మార్కెట్, పదినెలల గరిష్ట స్థాయికి క్షీణించింది. ఆసియా, అమెరికా, యూరప్ మార్కెట్ల పతనంతో పాటు ఐటీ, ఆటో వాటాల ట్రేడింగ్ నత్తనడకన కొనసాగడం సెన్సెక్స్ పతనానికి ప్రధాన కారణమైంది. విదేశీ మార్కెట్ల ట్రేడింగ్ క్షీణత, మదుపు దారులు కొనుగోళ్లపై మొగ్గు చూపకపోవడం వంటి కారణాలతో సెన్సెక్స్ నష్టాలతో ముగిసింది .దీంతో ట్రేడింగ్ ముగిసే సమయానికి బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్, 79 పాయింట్లు పతనమై, 16, 780 పాయింట్ల మార్కు వద్ద నిలిచింది. ఇది మేము ఉదయం సూచించిన 16780 మద్దత్తు స్థాయి కి నూటికి నూరు పాళ్ళు సరిపోయే విధం గా ఉండటం విశేషం .అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 28 పాయింట్లు కోల్పోయి, 5,008 పాయింట్ల వద్ద ముగిసింది
నేటి ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ రంగం 1.30 శాతం, స్మాల్ క్యాప్ రంగం 0.90 శాతం నష్టపోయాయి. సేక్టరాల్ ఇండెక్స్ ల లో FMCG 1.14 % ,క్యాపిటల్ గూడ్స్ 0.42 % శాతం మేరకు లాభపడ్డాయి. కాగా మిగిలిన ఇండెక్స్ లన్ని కూడా నష్టపోయాయి. ఉదయం మా అంచనాలకి అనుగుణం గా రియాలిటి , ఆటో ఇండెక్స్ లు అత్యదికం గా క్షీణించాయి. ఆటో ఇండెక్స్ 2.14 % పతనం కాగా , రియాలిటి ఇండెక్స్ 2.88 % నష్టపోయింది. సెన్సెక్స్ స్టాకు ల లో MNM , JP ASSOCIATES అత్యధికం గా 5.2 % , 3.3 % చొప్పున నష్టపోయాయి. కాగా భారతి అయిర్ టెల్ 2.9 %, HUL 2.3 % మేరకు లాభపడ్డాయి.
- 25-1-2010
- మార్కెట్ నాడి
నేడు మరొక సారి మన మార్కెట్ల లో అమ్మకాల జోరు కొనసాగానున్నది. గత శుక్రవారం అమెరికా మార్కెట్లు బలహీనం గా ముగియటం తో ఆ ప్రభావం నేడు ఆసియా మార్కెట్ల పై పడటం తో నేడు అన్ని ఆసియా మార్కెట్లు తీవ్ర నష్టాల తో పయనిస్తున్నాయి. అమెరికా ఫేడ్ అధ్యక్షులు బెర్నంకే మరొక సారి ఆ పదవికి నియామకం అయ్యే ఆస్కారం పై నీలి నీడలు కమ్ముకునే అవకాశం ఉన్నందున , హేడ్జింగ్ ల పై అమెరికా బ్యాంకు ల పై నియంత్రణ మున్నగు అంశాలు అమెరికా మార్కెట్లను నష్టపరిచాయి. నేడు జపాన్ మార్కెట్లు కూడా నష్టాలతో పయనిస్తున్నాయి . బ్యాంకింగ్, ఆటో మొబైల్, రియల్ ఎస్టేట్ స్టాకులు భారి నష్టాలను నమోదు చేస్తున్నాయి. మన మార్కెట్లు కూడా ఇతర ఆసియా మార్కెట్ల కి అనుసంధానం గా గ్యాప్ డౌన్ తో ప్రారంభమయ్యే ఆస్కారం ఉంది. మన మార్కెట్లు ప్రధానం గా రిజర్వు బ్యాంక్ ఈ నెల 29 న ప్రకటించ బోయే ద్రవ్య పరపతి విధానం పై తర్జన భర్జన కి లోనుకానున్నాయి. రిజర్వు బ్యాంక్ ఈ సారి కీలక వడ్డీ రేటు ని పెంచితేనే , తదుపరి ఫిబ్రవరి లో ప్రకటించ బోయే విధానం పై వత్తిడి తగ్గగలదని గోల్డ్ మ్యాన్ సాచ్ సంస్థ పేర్కొన్నది. ఐతే రిజర్వు బ్యాంక్ వడ్డీ ని పెంచానున్నదన్న అంచనాల తో ఇప్పటికే విదేశీ మదుపర్ల కు సలహా నిచ్చే ప్రఖ్యాత అంతర్జాతీయ సంస్థలు మన ఈక్యిటి ల కు దూరం గా ఉండమని పిలుపు నిచ్చాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణం యొక్క ప్రభావం మార్కెట్లు పూర్తిగా పరిగణ న లో తీసుకోలేదని గోల్డ్మన్ సాచ్ అభిప్రాయపడింది. ఈ అంశం మన మార్కెట్ల సెంటిమెంట్ ని మరింత గా క్రుంగ దీసే అవకాశం ఉంది. ఐతే మన పారిశ్రామిక ఉత్పత్తి y-o-y 6 % వృద్ధి సాధించటం కొంత ఊరట కలిగించే అంశం .అదే విధం గా దుబాయ్ వరల్డ్ వద్ద ఆస్తుల విలువ $120 డాలర్లు గా ఉన్నదన్న సమాచారం వలన తమకున్న $ 57 బిలి యెన్ డాలర్ల అప్పు తీర్చటం పెద్ద సమస్య కాబోదని వార్తలు రావటం కూడా ప్రపంచ మార్కెట్ల సెంటిమెంట్ కి కొంత ఊరట కలిగించే విషయం. నేడు మన మార్కెట్లు నస్తాల తో ప్రారంభ మయ్యే అవకాశం ఉంది. మధ్యాన్నం తదుపరి షార్ట్ కవేరింగ్, దేశీయ సంస్థాగత మదుపర్లు కొంత bottom fishing చేసే అవకాశం ఉన్నందున మార్కెట్లు ముగింపు దశ లో కొంత ఎగబాకే అవకాశం కూడా ఉంది. ఏది ఏమైనా నేడు మార్కెట్ల పై bears తమ పట్టు ని పూర్తి గా బిగించనున్నాయి
- నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
- గత ముగింపు:16859
- అవరోధాలు:17002- 17240-17373-17493
- మద్దత్తులు:16810-16780-16683-16589
- మార్కెట్ ముందు చూపు
- ( 25-1-2010 నుండి 29-1-2010 )
ప్రపంచ వ్యాప్తం గామార్కెట్లు గత వారం ముగింపు సమయం లో భారి అమ్మకాల వత్తిడి కి గురి అయ్యాయి . చైనా ప్రభుత్వం అక్కడి బ్యాంకులు ఇచ్చే రుణాలపై నియంత్రణ అమలు చేయటం, అమెరికా ప్రెసిడెంట్ ఒబామా ,ఈక్విటీలలో బ్యాంకుల పెట్టుబడులను తగ్గించే దిశా గా చర్యలు తీసుకోవటం మున్నగు అంశాలు అంతర్జాతీయ మార్కెట్లు నష్టపోవటానికి కారణమయ్యాయి. గత వారం మన మార్కెట్లు సుమారు 4 % నష్టాలను చవిచూశాయి. LNT ఫలితాలు నిరాశాపరచటం కూడా మదుపర్ల లో అప్రమత్త ధోరణి అలవరచుకునే విధం గా వాతావరణం సృష్టించింది. ఇక ఈ వారం గురించి చర్చిస్తే, 26 , మంగళవారం గణతంత్ర దినోత్సవం కారణం గా మార్కెట్లకు సెలవు. కాబట్టి కేవలం నాలుగు రోజులు మాత్ర మే ట్రేడ్ కానున్నాయి. గత శుక్రవారం అమెరికా మార్కెట్లు తమ నష్టాలను కొనసాగించటం వలన సోమవారం మన మార్కెట్ల లో శుభారంభం జరిగిగే ఆస్కారాలు తక్కువ. గురువారం జనవరి F & O ముగింపు , శుక్రవారం రిజర్వు బ్యాంకు ద్రవ్య పరపతి విధానం రేటు పై సమావేశం మున్నగు కీలక అంశాలు చోటు చేసుకునే నేపధ్యం లో ఈ వారం మార్కెట్ల లో మదుపర్లు ధైర్యం గా పెట్టుబడులు పెట్టె ఆస్కారం తక్కువ. రిజర్వు బ్యాంకు రేపో రేటుని , రివర్స్ రేపో రేటు ని పెంచే ఆస్కారాలు కనవస్తున్నందున మార్కెట్ల లో అమ్మకాల వత్తిడి కొనసాగే అవకాశం ఉంది. ఐతే మార్కెట్లు ఇప్పటికే 50 బేసిస్ పాయింట్ల మేరకు వడ్డి రేటుని రిజర్వు బ్యాంకు పెంచగలదని అంచనాల తో ఉండటం తో , 50 బెసిసి పైంట్ల కంట అధికం గా వడ్డీ రేటు ని పెంచితే , మార్కెట్లు ప్రతికూలం గా స్పందించే అవకాశం ఉంది. ఐతే గత రెండు మూడు రోజులు గా మార్కెట్ల లో ఏర్పడ్డ షార్ట్ పొజిషన్ల ని ఆపరేటర్లు, ట్రేడర్లు గురువారం డెరి వేటివ్స్ ముగింపు సందర్భం గా కవేరింగ్ చేసుకునే అవకాశం ఉన్నందున మార్కెట్లు కొంత పెరిగే అవకాశం కూడా ఉంది. . కాబట్టి ముందుగా మార్కెట్లు ఈ వారం ముందుగా కొంత కోల్పోయి, తరువాత పెరిగి మరల క్షీణించే అవకాశం ఉంది . ఈ వారం ఫలితాలను వెల్లడించే కంపనీలైన Hero Honda Mahindra & Mahindra, State Bank of India, Hindustan Unilever, Sterlite Industries, Tata Steel, Hindalco, Tata Motors, Sun Pharmaceuticals, DLF. మదుపరుల దృష్తి ని ఆకర్షించా నున్నాయి. ఈ వారం DII ,FII ల క్రయ విక్రయాలు కూడా మార్కెట్లను ప్రభావితం చేయనున్నది. ప్రపంచ వ్యాప్తం గా మైనింగ్ కంపనీలు కూడా వత్తిడి కి లోనవుతున్న టెక్నికల్ గా గత వారం సెన్సెక్స్ 75 రోజుల సంచలన సగటు అయిన పాయింట్ల వద్ద 16859 మద్దత్తు తీసుకుంది. సెన్సెక్స్ నకు ఈ వారం 16683 , ఆ తరువాత 16512 పాయింట్ల మద్దత్తు కీలక పాత్ర పోషించ నున్నది. 17041-17373-17457 సెన్సెక్స్ నకు కీలక అవరోధాలు కాగా 16512-16340-16252 -16113పాయింట్లు ముఖ్యమైన మదత్తు స్థాయిలు .