• 27-1-2010
  • మార్కెట్ నాడి

నిన్న బ్రిటిన్ లో విడుదల అయిన గణాంకాల నేపధ్యం లో బ్రిటిన్ ఆర్ధిక మాంద్యం నుండి గట్టెక్కినట్లే అని సూచనలు రావటం తో నిన్న స్వల్ప లాభాలతో ఐరోపా మార్కెట్లు ముగిసాయి. కాగా అమెరికా మార్కెట్ల ల లో వినియోగ దారుల లో పెరుగుతున్న విశ్వాసాన్ని ప్రతిబింబిస్తూ గణాంకాలు 53.6 నుండి 59. 6 వరకు పెరగటం తో లాభాల బాట లో కొనసాగినా , ప్రెసిడెంట్ ఒబామా నేటి రాత్రి స్టేట్స్ యూనియెన్ సమావేశాల లో ప్రకటించ బోయే విధానాల పై అప్రమత్తత నెలకొని చివరికి స్వల్ప నష్టాల తో ముగిసింది. అమెరికా బడ్జెట్ లోటు రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ఇంత లోటు ఈ సారే అత్యధికం గా ఉండగలదన్న అంచనాల తో స్టాక్ మార్కెట్లు సతమత మయ్యాయి. దీనితో నేడు ఆసియా మార్కెట్లు కూడా స్వల్ప నష్టాల తో పయనిస్తున్నాయి. ముఖ్యం గా కమో డి టి లు మరొక సారి భల్లుకాల దెబ్బకి కుదేలుమంటున్నాయి . చమురు, లోహాలు భారీగా నష్టపోతున్నాయి . చైనా మార్కెట్లు టెక్నికల్ గా మరింత దిద్దుబాటు కి లోనుకానున్నట్లు వార్తలు వెలువడటం , చైనా ప్రభుత్వం నియంత్రణ పరంపర కొనసాగించటం ఆసియా మార్కెట్ల సెంటిమెంట్ ని దెబ్బతీస్తోంది . జపాన్, సింగపూర్ మార్కెట్లు కూడా మిశ్రమంగా పయనిస్తున్నాయి.

ఈ అంశాలు మన మార్కెట్ల పై కొంత ప్రతికూల ప్రభావం కనపరిచే అవకాశం ఉన్నప్పటికీ దేశీయం గా కొన్ని ఊరట కలిగించే అంశాలు వెలుగులోకి వచ్చాయి. CMIE 2010 /11 నకు గాను మన దేశ GDP వృద్ధి ప్రస్తుతం ఉన్న 6.2 %నుండి 9.2 % వరకు ఎగబాక నున్నట్లు ప్రకటించటం, IMF , ప్రపంచ ఆర్ధిక పరిస్థితి పై విడుదల చేసిన నివేదిక లో మన దేశం పై ప్రశంసల వర్షం కురిపించటం ,భారత దేశాన్ని “ PRETTY BULLISH” గా అభివర్ణించటం మున్నగు అంశాలు మన మార్కెట్ల లో ఉత్సాహం నింప నున్నాయి. పైగా PACIFIC INVESTMENT MANAGEMENT CO అధినేత బిల్ గ్రోస్స్ మన మార్కెట్లు అత్యుతమంగా ఉన్నాయని, విదేశీ మదుపర్లు భారత్ , చైనా వంటి సంప్రదాయ ఆర్ధిక వ్యవస్థల లో మాత్రమె పెట్టుపడి పెట్టటం మంచిదని పదే పదే చెప్పటం కూడా మన మార్కెట్లకి జోరు అందించ నున్నాయి.

ఈ అంశాల నేపధ్యం లో మన మార్కెట్లు ఆసియా మార్కెట్లని అనుసరించి ముందుగా కొంత బలహీనం గా ప్రారంభమయినప్పటికీ , తరువాత కోలుకునే అవకాశాలు ఉన్నాయి. పైగా రేపు ముగియవలసిన F & O ముగింపు నేపధ్యం లో కూడా కొంత షార్ట్ కవేరింగ్ కి అవకాశం ఉంది.

  • నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
  • గత ముగింపు:16780
  • అవరోధాలు:16810-17002- 17240-17373
  • మద్దత్తులు:16780-16683-16589 -16512