- 21-1-2010
- మార్కెట్ రిపోర్ట్
అంతర్జాతీయ మార్కెట్ల ట్రేడింగ్ కుప్పకూలడంతో బాంబే స్టాక్ మార్కెట్ కూడా నిరాశాజనకంగా ముగిసింది.మేము ఉదయం సూచించిన విధం గా ... అమ్మకాల ఒత్తిడి, ట్రేడింగ్ క్షీణత వంటి కారణాలతో తిరోగమనంవైపు పయనించిన బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్, ట్రేడింగ్ ముగిసే సమయానికి 192 పాయింట్లు భారీగా పతనమై, 16,859 పాయింట్ల మార్కు వద్ద నిలిచింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 65 పాయింట్లు కోల్పోయి, 5,029 పాయింట్ల మార్కు వద్ద ముగిసింది.
నేటి ట్రేడింగ్ లో అత్యంత బలహీనం గా ప్రారంభమయిన మార్కెట్లు కనిష్టం గా 16608 పాయింట్ల వరకు పడిపోయింది. ఐతే రిలయన్స్ ఫలితాలు ఆశా జనకం గా విడుదల కావటం తో మార్కెట్లు కొంత కోలుకునే ప్రయత్నం చేసాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ (రిల్) నికర ఆదాయం ముగిసిన మూడో త్రైమాసికంలో 15.77 శాతం మేరకు పెరిగింది. ఇంత భారీ మొత్తంలో రిల్ ఆదాయం పెరగడం గత ఐదు త్రైమాసికాల్లో ఇదే తొలిసారి కావడం గమనార్హం. పైగా నిన్న ఏర్పడ్డ షార్ట్ పొజిషన్ లు ట్రేడర్లు క్రమేపి కవర్ చేసుకోవటం తో మార్కెట్లు నష్టాన్ని పూరించుకునే ప్రయత్నం చేయటం తో సెన్సెక్స్ మరొక సారి 17000 పాయింట్ల వరకు చేరుకుంది. కాని మార్కెట్ల లో బలహీనత తీవ్రం గా ఉండటం తో సెన్సెక్స్ చివరికి 16852 పాయింట్ల వద్ద ముగిసింది.
నేటి ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ రంగం 1.09 శాతం , స్మాల్ క్యాప్ రంగం 1.14 శాతం తిరుగమనం సాధించాయి.
సేక్తోరాల్ ఇండెక్స్ ల లో నేడు FMCG, PSU ఇండెక్స్ లు మినహా మిగిలిన అన్ని ఇండెక్స్ లు నష్టాలను చవిచూసాయి. నేటి ట్రేడింగ్ లో రియాలిటి రంగం అత్యధికం గా 1.70 % బలహీనపడగా ఐ. టి. 1.61% నష్టపోయింది.
సెన్సెక్స్ స్టాకు ల లో BHEL 3.26 % ,ITC 2.13 % లాభపడ్డాయి .కాగా టాటా స్టీల్ 3.67% , LNT 3.41 % నష్టపోయి సెన్సెక్స్ కోల్పోఎందుకు దోహద పడింది.