- 8-1-2010
- మార్కెట్ రిపోర్ట్
వారాంతమైన శుక్రవారం బాంబే స్టాక్ మార్కెట్ నష్టాలతో ముగిసింది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న బాంబే స్టాక్ మార్కెట్.. లాభనష్టాలతో ఒడిదుడుకులను ఎదుర్కొంది. కానీ ట్రేడింగ్ ముగిసే సమయానికి బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్,ఉదయం మేము సూచించిన విధం గా క్షీణిస్తూ 75 పాయింట్లు కోల్పోయి 17,540 పాయింట్ల మార్కు వద్ద ముగిసింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 18 పాయింట్ల స్వల్ప నష్టంతో, 5,244 పాయింట్ల మార్కు వద్ద ముగిసింది . విదేశీ మార్కెట్లు ఆశాజనకంగా కొనసాగుతున్నప్పటికీ.. దేశీయ వాటాలు అమ్మకాల ఒత్తిడికి గురవడంతో సెన్సెక్స్ పతనమయ్యింది. . అంతేగాకుండా.. మదుపుదారులు కొనుగోళ్లపై దృష్టి సారించకపోవడం సెన్సెక్స్ క్షీణించేందుకు ప్రధాన కారణమయ్యింది.
నేటి ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ రంగం 0.02 % , స్మాల్ క్యాప్ రంగం 0.44 % లాభాలను గడించటం విశేషం .
సేక్టర్ల ఇండెక్స్ ల లో రియాలిటీ ఇండెక్స్ 3.23 % , క్యాపిటల్ గూడ్స్ 0.59 % లాభపడ్డాయి .కాగా ఐ. టి ఇండెక్స్ అత్యధికం గా 2 % నష్టపోయింది. మంగళవారం విడుదల కానున్న ఇన్ఫోసిస్ త్రై మాసిక ఫలితాల నేపధ్యం లో ఈ స్టాకు కొంత అమ్మకాల వత్తిడి కి గురికావటం తో ఈ ఇండెక్స్ నష్ట పోయేందుకు ప్రధాన పాత్ర పోషించింది. కాగా టెక్ ఇండెక్స్ కూడా 1.7 % మేరకు నష్ట పోయి ఐ. టి. ఇండెక్స్ కి తోడూ గా నిలిచింది. సెన్సెక్స్ వాటా ల లో నేడు DLF 4 .3%, గ్రాసిం 3 % లాభపడ్డాయి. కాగా ఇన్ఫోసిస్ 2.4 %, విప్రో 2% నష్టపోయాయి.
సెన్సెక్స్ స్టాకు లను పరిశీలిస్తే , నేడు హిందాల్కో 2.19 % , రిలయన్స్ 1.60 % వృద్ధిని నమోదు చేసాయి. కాగా టాటా మోటర్స్ 3.46% , టి . సి . ఎస్ . 2.77 % నష్టపోయి సెన్సెక్స్ కోల్పోఎందుకు దోహద పడ్డాయి.