• 8-1-2010
  • మార్కెట్ నాడి

అమెరికా మార్కెట్లు గత రాత్రి ముందుగా నష్టాలను చవి చూసి, సానుకూల చిల్లర వ్యాపార అమ్మకాల గణాంకాల నేపధ్యం లో, రియల్ ఎస్టేట్ నష్టాలు తగ్గు ముఖం పడుతున్నయన్న అంశాల వలన , మార్కెట్లు కోలుకొని చివరికి ఫ్లాట్ గా ముగిసాయి.నిరుద్యోగ గణాంకాలు కూడా ఫ్లాట్ గా ఉండటం తో మార్కెట్లు మందకొడిగా ముగిసాయి. ముఖ్యం గా నేడు రాత్రి విడుదల కానున్న మాసిక నిరుద్యోగ గణాంకాల పై మార్కెట్లు ద్రుష్టి సారించటం తో అమెరికా మార్కెట్లు ఫ్లాట్ గా ముగిసాయి.

ఐతే అమెరికా మార్కెట్ల లో రిటైల్ అమ్మకాలు ఊపందుకున్న నేపధ్యం లో , అమెరికా లో వినియోగం పెరుగుతున్నదన్న సంకేతాల నేపధ్యం లో ఆసియా మార్కెట్లు పుంజుకుంటున్నాయి. జపాన్ యెన్ విలువ క్షీణించటం కూడా జపాన్ ఎగుమతి దారుల కు ఉపయుక్తం కానున్నదన్న అంశం తో కూడా జపాన్ మార్కెట్లు లాభాల లో పయనిస్తున్నది.

ఇక మన మార్కెట్ల ను ప్రభావితం చేసే అంశాలను పరిశీలిస్తే సానుకూల ప్రపంచ మార్కెట్లు మన మార్కెట్లకి ఊతం అందించే అవకాశం ఉన్నప్పటికీ, అంతర్జాతీయ క్యాపిటల్ మార్కెట్ల అధ్యయనం లో అగ్రగామి గా నున్న అంబిట్ క్యాపిటల్ మార్కెట్ సంస్థ , 2010 కి గాను భారత మార్కెట్లు అంతంత మాత్రం గా నే ఉండవచ్చని, సెన్సెక్స్ ప్రధానం గా 15000 - 19000 మార్కు మధ్య ఆటుపోట్ల కి గురి కానున్నదని, పెరగనున్న కీలక వడ్డీ రేటు , ఉద్దేపన ఉపసంహరణ మున్నగు అంశాలు భారత మార్కెట్లను ప్రతికూలం గా ప్రభావితం చేయనున్నట్లు జోస్యం చెప్పారు. అంటే కాక అమెరికా స్టాక్ మార్కెట్లు పుంజు కుంటే, భారత్ నుండి విదేశీ సంస్థాగత మదుపర్లు, పెరగనున్న అమెరికా మార్కెట్లకి తరలి వెళ్ళిపోయే అవకాశం ఉందని అంచనా వేయటం వలన నేడు మన మార్కెట్ల పై పిడుగు పాటు కానున్నది. అంటే కాక ఆంధ్ర ప్రదేశ్ దివంగత ముఖ్య మంత్రి రాజ శేఖర రెడ్డి మరణం వెనుక అంబాని సోదరుల హస్తం ఉందన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తం కావటం వలన కే . జి బేసిన్ లో రిలయన్స్ కార్యకలాపాలకి స్వల్ప కాలానికి గాను కొంత విఘ్నం వాటిల్లే అవకాశం ఉంది.ఈ అంశం మార్కెట్లు నిశితం గా పరిశీలించ నున్నది. ఐతే, నేడు రిలయన్స్ ,లోన్దేల్ బాసెల్ లో వాటాలను కొనుగోళ్ళు చేసే యత్నం లో గతం లో $ 12 బిలియన్ల బదులుగా 13.5 $ బిలియన్ల మేరకు బిడ్ దాఖలు చేయనున్నట్లు ప్రకటించటం తో, ఈ కౌంటర్ ని, తద్వారా సెన్సెక్స్ ని నిలబెట్టే ప్రయత్నం చేయనున్నది.

ఏది ఏమైనప్పటికీ , ఇతర ప్రపంచ మార్కెట్ల లో చోటు చేసుకున్న ఉత్సాహం నేడు మన మార్కెట్ల లో ముందు గా కొంత కనిపించినప్పటికీ, ఆరంభ శూరత్వం మాదిరిగా , చివరికి అమ్మకాల వత్తిడి కి గురి అయ్యే అవకాశం ఉంది.

  • నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
  • గత ముగింపు: 17615
  • అవరోధాలు: 17620-17735-17824
  • మద్దత్తులు:17578-17493-17373