• 1౦-1-2010
  • మార్కెట్ ముందు చూపు
  • (11-1-2010 నుండి 15-1-2010 వరకు )

గత వారం బలం గా ప్రారంభమైన మార్కెట్లు మిశ్రమ ప్రపంచ మార్కెట్ల పోకడల నేపధ్యం లో వారాంతానికి అమ్మకాల వత్తిడి కి గురి అయ్యింది. అగ్రగామి కంపనీల త్రై మాసిక ఫలితాల ఈ వారం వెలవడనున్నాయి . ఈ అంశం కూడా మదుపర్లను కొంత అప్రమత్త ధోరణి కి గత వారం గురి చేసింది.

ఈ వారం INFOSIS, TCS, AXIS BANK, HDFC BANK, BAJAJ AUTO మున్నగు కంపనీలు తమ ఫలితాలను విడుదల చేయనున్నాయి. ఈ నేపధ్యం లో మార్కెట్ల లో స్టాకుల వారిగా సంచలం కనపడే అవకాశం ఉంది. ఆయా కంపనీల ముందస్తు పన్ను చెల్లింపుల గణాంకాలు ఆశాజనకం గా ఉండటం ఆసక్తికరం.

రానున్న రోజుల లో పెరుగుతున్న ద్రవ్యల్బణం మార్కెట్లను కొంత అసౌకర్యానికి గురిచేసే అంశం .. ఈ గురు వారం రిజర్వు బ్యాంక్ డెప్యు టి గవర్నర్ బ్యాంకర్ల తో జరపనున్న భేటి లో , ఈ మాసం చివరన , అంటే 29 తేది న జరగనున్న వడ్డీ రేటు పై రిజర్వు బ్యాంక్ సమీక్ష లో ఏమి చర్చించ వచ్చన్న అంశం పై కొంత అవగాహన కలిగే అవకాశం ఉంది.

ఆర్ధిక మంత్రి ప్రనాబ్ ముఖేర్జి , దేశ ఆర్థిక అభివృద్ధి మునుముందు 12 % వరకు ఉండగలదని ఆశాభావం వ్యక్తం చేయటం, 2011 సంవత్సరాని కి 9 % వృద్ధి సాధించగలదని మోన్ టెక్ సింగ్ ఆహువాలియా ఆశా భావం వ్యక్తం చేయటం కూడా మార్కెట్లకు ఉత్సాహం కలిగించే అంశం. కాబట్టి రిజర్వు బ్యాంక్ త్వరలో కీలక వడ్డీ రేటు ని పెంచేందుకు భూమిక ని ఏర్పరుచుకునే దశ గా , మును ముందు గా CRR రేటు ని పెంచగలదని అంచనాలు ఇప్పటి కే ఉన్నాయి. ప్రధాన మంటి ఆర్థిక సలహాదారుడు శ్రీ రంగరాజన్ కూడా ఇదే అంశాన్ని పదే పదే ప్రస్తావించటం గమనార్హం.

ప్రభుత్వ రంగ సంస్థల లో పెట్టుపడులను ఉపసంహరణ వేగీ కృతం చేసే అవకాశం ఉన్నందున ,ఈ వారం PSU రంగ సంస్థలు ముఖ్య ఆకర్షణ కానున్నాయి. అదే విధం గా మంగళవారం విడుదల కానున్న ఇన్ఫోసిస్ ఫలితాలు కూడా ఇతర సాఫ్ట్ వేర్ కంపనీ వాటాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది.

గత వారం రియాలిటి మరియు ఇన్ఫ్రా స్టాకు లు భారిగా కోల్పోయాయి. ఐతే ప్రభుత్వం రహదారుల నిర్మాణానికి పెద్ద పీట వేయనున్నట్లు గత శుక్రవారం ప్రకటించటం వలన ఇన్ఫ్రా స్టాకు ల లో కొంత ఊపు కనపడే అవకాశం ఉంది.

అంతర్జాతీయ మార్కెట్ల పోకడలు, అమెరికా డాలర్ విలువ ,మంగళవారం అమరికా లో విడుదల కానున్న అంతర్జాతీయ ట్రేడ్ గణాంకాలు, గురువారం- చిల్లర వ్యాపార గణాంకాలు , శుక్రవారం -ఉత్పత్తి గణాంకాలు కూడా మన మార్కెట్లను కొంత మేరకు ప్రభావితం చేయనున్నాయి.

టెక్నికల్ గా ఈ వారానికి 17620-17785-17824-18000 పాయింట్లు కీలక అవరోధాలు కాగా ,17493-17237-17120-17002-పాయింట్ల స్థాయిలు ముఖ్య మద్దతులు. 50 రోజుల చలన సగటు ఐన 16900 పాయింట్లు అతిముఖ్యమైన మద్దత్తు గా పేర్కొనవచ్చు.