• 7-1-2010
  • మార్కెట్ రిపోర్ట్
దేశీయ, అంతర్జాతీయ మార్కెట్ల ట్రేడింగ్ క్షీణించడంతో గురువారం బాంబే స్టాక్ మార్కెట్ నష్టాలతో ముగిసింది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి తిరోగమనంలో ర్యాలీని కొనసాగించిన బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్.. ట్రేడింగ్ ముగిసే సమయానికి 85 పాయింట్లు పతనమై, 17,616 పాయింట్ల వద్ద నిలిచింది. ఇది మేము ఉదయం సూచించిన 17 , 620 పాయింట్ల అవరోదానికి అత్యంత సమీపం గా ఉండటం విశేషం . అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 19 పాయింట్ల నష్టంతో, 5,263 పాయింట్ల వద్ద ముగిసింది. ఐటీ, ఆటో వాటాల ట్రేడింగ్‌తో నష్టాలతో పయనించిన స్టాక్ మార్కెట్ ఒక దశలో 177 పాయింట్లు భారీగా క్షీణించి, 17,566 మార్కు వద్ద ర్యాలీని కొనసాగించింది. కానీ తిరిగి కోలుకుని ట్రేడింగ్ ముగిసే సమయానికి 85 పాయింట్ల వద్ద నిలిచింది.ఆసియా, యూరప్ మార్కెట్ల ట్రేడింగ్ ఊపందుకోకపోవడంతో పాటు, మదుపుదారులు అమ్మకాల వైపు కొనసాగడంతో సెన్సెక్స్ నష్టాలను చవిచూసింది. ఇంకా దేశీయ వాటాల అమ్మకాల ఒత్తిడికి గురికావడంతో బాంబే స్టాక్ మార్కెట్ పతన మైయ్యింది.
అలాగే డిసెంబరు 26 తో ముగిసిన వారాంతానికి ద్రవ్యోల్బణం 18.22 శాతం గా నమోదు అయ్యింది. ఇందులో ఆహార ధాన్యాలు కొంత తగ్గినప్పటి కీ , చమురు ధరలు ఎగబాకటం తో ద్రవ్యోల్బణం లో పెద్దగా తగ్గుదల నమోదు కాలేదు. డిసెంబరు మూడవ వారంలో ద్రవ్యోల్బణం 19.83 శాతంగా ఉండింది.
నేటి ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ రంగం 0.02 % స్వల్ప నష్టం చవిచూడగా , స్మాల్ క్యాప్ రంగం 0.67 % లాభాలను గడించింది.
సెన్సెక్స్ స్టాకు లను పరిశీలిస్తే , నేడు హిందాల్కో 2.19 % , రిలయన్స్ 1.60 % వృద్ధిని నమోదు చేసాయి. కాగా టాటా మోటర్స్ 3.46% , టి . సి . ఎస్ . 2.77 % నష్టపోయి సెన్సెక్స్ కోల్పోఎందుకు దోహద పడ్డాయి.