- 7-1-2010
- మార్కెట్ నాడి
గత రాత్రి అమెరికా మార్కెట్లు తీవ్ర ఒడి దుడుకులకు లోనయ్యి చివరికి స్వల్ప నష్టాల తో ముగిసింది. అమెరికా లో సర్వీసు రంగం పుంజుకోవటం, ప్రైవేటు రంగం లో ఉద్యోగాలు తగ్గటం వంటి మిశ్రమ ఫలితాల నడుమ , అమెరికా మార్కెట్లు ఎటూ తేల్చుకోలేక ఆటు పొట్ల కి గురి అయ్యాయి. నేడు ఆసియా మార్కెట్లు కూడా అమెరికా మార్కెట్ల నే అనుకరిస్తున్నాయి.
మన మార్కెట్లు నిన్న కనపరిచిన బలహీనత , ప్రపంచ మార్కెట్ల ను అనుసరించి నేడు కూడా కనపరచ నున్నది . 22 మాసాల గరిష్ట స్థాయి లో ఉన్న మన మార్కెట్లు , నేడు విడుదల అయ్యే ద్రవ్యోల్బణ గణాంకాలను నిశితం గా పరిశీలించ నున్నది . ఉద్దిపణలు అతి గా ఉండటం సమర్ధనీయం కాదని ఆర్ధిక మంత్రిత్వ శాఖ పేర్కొనటం కూడా మార్కెట్లు పరిగణ న లో తీసుకోనున్నాయి..
SEBI , వాటాలను అప్పుగా ఇవ్వటం ,తీసుకోవటం ( STOCK LENDING AND BORROWING ) పై
గతం లో ఉన్న 30 రోజుల పరిమితి ని ఒక సంవత్సరం వరకు పెంచింది. ఈ అంశం సంస్థా గత మదుపర్లకు ఉపయుక్తం కానున్నది.
గత రాత్రి ప్రభుత్వం BSNL లో 10 % వాటా ని తక్షణమే విక్రయించాలని తీసుకున్న నిర్ణయం మార్కెట్ల లో , ముఖ్యం గా టెలికాం రంగం, MTNL వాటాలను సానుకూలం గా ప్రభావితం చేసే అవకాశం ఉంది.
- నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
- గత ముగింపు: 17701
- అవరోధాలు: 17735-17824-18000
- మద్దత్తులు:17620-17578-17493-17373