- 6-1-2010
- మార్కెట్ రిపోర్ట్
గత రెండు రోజులు గా భారి లాభాలను ఆర్జించిన మన మార్కెట్లు నేడు కొంత విశ్రాంతి తీసుకున్నాయి. దీంతో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 15 పాయింట్ల స్వల్ప వృద్ధిని నమోదు చేస్తూ 17701 పాయింట్ల వద్ద ఫ్లాట్ గా ముగిసింది. మేము ఉదయం ప్రత్యేకం గా సూచించిన విధం గా 17735 పాయింట్ల అవరోధాన్ని నేడు సెన్సెక్స్ చెదించ లేక పోవటం గమనార్హం . నేటి ట్రేడింగ్ లో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ పాయింట్ల తేడా లేకుండా నిన్నటి ముగింపు అయిన 5281పాయింట్ల వద్ద ముగిసింది. నేడు మార్కెట్లు consolidate అయ్యే ప్రయత్నం చేశాయని చెప్పవచ్చు. ఈ ప్రక్రియ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.68 శాతం , స్మాల్ క్యాప్ ఇండెక్స్ ౦.44 % లాభాలను ఆర్జించాయి.
సేక్తోరాల్ ఇండెక్స్ ల లో హెల్త్ కేర్ రంగం 2 % , రియాలిటి రంగం 1.4 % వృద్ధిని నమోదు చేయగా , ఐ. టి ఇండెక్స్ 1.4 % , టెక్ ఇండెక్స్ 1.1 % చొప్పున బలహీనపడ్డాయి.
సెన్సెక్స్ వాటా ల లో నేడు టాటా పవర్ 4.6 % , గ్రాసిం 4.3 % లాభాలను ఆర్జించగా, మారుతి ౩.5 % , హిందాల్కో 2.5 % క్షీణించాయి.