• 5-1-2010
  • మార్కెట్ రిపోర్ట్

బాంబే స్టాక్ మార్కెట్ లాభాలతో ముగిసింది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి ఆశాజనకంగా కొనసాగిన బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్.. ట్రేడింగ్ ముగిసే సమయానికి 127 పాయింట్లు పుంజుకుని 17,730 పాయింట్ల స్థాయికి చేరుకుంది.ఒక దశ లో గరిష్టం గా 17730 పాయింట్ల వరకు చేరుకుంది. ఇది ఉదయం మేము సూచించిన కీలక స్థాయి ఐన 17735 కి అత్యంత సమీపం గా గుర్తించాలి. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 48 పాయింట్లు బలపడి, 5,278 పాయింట్ల వద్ద ముగిసింది. ఆసియా, యూరప్‌ మార్కెట్లు ఆశాజనకంగా ర్యాలీని కొనసాగించడం, అలాగే సోమవారం అమెరికా మార్కెట్ లాభాలను నమోదు చేసుకోవడం సెన్సెక్స్ వృద్ధికి ప్రధాన కారణమయ్యింది. . ఇంకా మదుపుదారులు విదేశీ కొనుగోళ్లపై మొగ్గుచూపడం, దేశీయ వాటాల ట్రేడింగ్, కొనుగోళ్లు పుంజుకోవడం సెన్సెక్స్ వృద్ధికి కలిసొచ్చింది.

నేడు మిడ్ క్యాప్ రంగం 1.20 %, స్మాల్ క్యాప్ రంగం 0.85 % మేరకు లాభాలను ఆర్జించాయి.

నేటి ట్రేడింగ్ లో ఆటో ఇండెక్స్ మినహా అన్ని సేక్టరాల్ ఇండెక్స్ లు లాభాలను ఆర్జించాయి. ఆటో రంగం 0.25 % క్షీణించగా , మెటల్స్ ఇండెక్స్ 3. 82 % ఎగబాకింది. కాగా రియాలిటి ఇండెక్స్ 1.14 % లాభపడింది. ప్రభుత్వ రంగ సంస్థ హిందాల్కో ని మూడు ముక్కలు గా విభజించనున్నట్లు ప్రకటించటం తో హిందాల్కో వాటాలు అత్యధికం గా 15 % ఎగబాకాయి . చివరకి 7 . 4 % వృద్ధి సాధించి స్థిరపడింది. కాగా JP ASSOCIATES వాటాలు కూడా 5.8% మేరకు వృద్ధిని సాధించాయి. ఆటో రంగం ప్రాఫిట్ బుకింగ్ కి లోను కావటం వలన టాటా మోటర్స్ 2%, మారుతి 2.3% నష్టపోయాయి.