• 6-1-2010
  • మార్కెట్ నాడి
ఫ్యాక్టరీ ఉత్పత్తి గణాంకాలు అంచనాలని మించి వెలువడటం తో అమెరికా మార్కెట్లు గత రాత్రి లాభపడ్డాయి. ఈ ప్రభావం వలన ఆసియా మార్కెట్లు కూడా లాభాల లో పయనిస్తున్నాయి. చైనా ఉత్పత్తి గణాంకాలు కూడా అంచనాలను మించి వెలువడటం తో ఆసియా మార్కెట్లు జోరుగా కొనసాగుతున్నాయి. జపాన్ ఎయిర్ వేస్ దివాలా గా ప్రకటించటమే సబబని అక్కడి డెవ్లప్ మెంట్ బ్యాంక్ ప్రకటించటం తో జపాన్ అయిర్ వేస్ కి అప్పు ఇచ్చిన అక్కడి బ్యాంకింగ్ స్టాకులు కొంత వత్తిడి కి లోనవుతున్నప్పటికీ జపాన్ మార్కెట్లు నిలదొక్కుకో గలిగాయి.
మన మారేట్లను ప్రభావితం చేసే ఇతర స్థానిక అంశాలను పరిశీలిస్తే, ప్రత్యక్ష పన్ను వసూలు గణనీయం గా పెరిగి 2.5 లక్షల కోట్లు దాటటం మార్కెట్ల సెంటిమెంట్ ని కొంత బలబరచ నున్నది . సానుకూల ప్రపంచ వాతావరణం మధ్య నేడు కూడా మన మార్కెట్లు పుంజుకునే అవకాశం ఉంది.
టెక్నికల్ గా సెన్సెక్స్ నకు 17735 పాయింట్లు సెన్సెక్స్ నకు నేటి ట్రేడింగ్ లో అతి కీలక అవరోధం. గ్యాప్ అప్ తో ఈ అవరోధం చేదిస్తే , మార్కెట్లు నేడు మరింత గా బలపడే అవకాశం ఉంది.
  • నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
  • గత ముగింపు: 17686
  • అవరోధాలు: 17735-17824-18000
  • మద్దత్తులు:17620-17578-17493-17373