- 5-1-2010
- మార్కెట్ నాడి
గత రాత్రి అమెరికా మార్కెట్లు భారి గా లాభాలను నమోదు చేసి 2010 ని శుభారంభం చేసాయి. ఉత్పత్తి రంగం లో గణనీయమైన పెరుగుదల నమోదు కావట్టావుం తో మార్కెట్లు బలపడ్డాయి. చైనా, భారత మరియు ఐరోపా మార్కెట్ల లో కూడా ఉత్పత్తి రంగం వృద్ధి సాధించటం తో ప్రపంచ వ్యాప్తం గా ఆర్ధిక వ్యవస్థ కోలు కుంటున్న దన్న వాదన కి ఊతం ఇచ్చింది. ఉత్పత్తి రంగం వృద్ధి సాధిస్తున్నందున కమోడిటిలకు రెక్కలు వస్తున్నాయి. దీనితో రాగి గరిష్ట స్థాయి కి చేరుకుంది. కాగా చమురు 81 డా లర్ పై చిలుకు దాటింది. బలపడుతున్న కామో డిటి ల కారణం గా, బలంగా ముగిసిన అమెరికా మార్కెట్ల నేపధ్యం లో నేడు ఆసియా మార్కెట్లు కూడా లాభాల లో పయనిస్తున్నాయి
మన దేశం ఉత్పత్తి రంగం వృద్ధి సాధించటం తో మన మార్కెట్ల లో మరింత గా విదేశీ పెట్టుపడులు రావచ్చన్న అంచనాల తో రూపాయి విలువ పుంజుకుంటున్నది.
కాగా నిన్న ప్రధాన మంత్రి ముఖ్య ఆర్ధిక సలహా దారుడు శ్రీ కౌశిక్ బాసు , ఇప్పట్లో ద్రవ్య విధానాన్ని కట్టు దిట్టం చేసేది లేదని స్పష్టం చేయటం కూడా నేడు మన మార్కెట్ సెంటిమెంట్ ని బలపరచ నున్నాయి. టెక్నికల్ గా అతి కీలక అవరోధమైన 17493 నిన్నటి ట్రేడింగ్ లో సెన్సెక్స్ చేధించింది . ప్రపంచ మార్కెట్లు కూడా అనుకూలం గా ఉన్నందున , నేడు మార్కెట్ల లో బుల్ల్స్ తమ ఆధిపత్యం చాట నున్నాయి.
నేడు మార్కెట్లు గ్యాప్ అప్ తో శుభారంభం చేయనున్నాయి.
- నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
- గత ముగింపు: 17558
- అవరోధాలు: 17578-17620-17735-17824
- మద్దత్తులు:17493-17373-17240-17124