• 4-1-2010
  • మార్కెట్ రిపోర్ట్

నూతన సంవత్సరాన్ని స్టాక్ మార్కెట్లు శుభారంభం చేసాయి. దీంతో నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ 31 పాయింట్లు బలపడి, 5,232 పాయింట్ల వద్ద ముగిసింది. అలాగే బాంబే ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ ట్రేడింగ్ ముగిసే సమయానికి 93 పాయింట్లు వృద్ధి చెంది, 17,558 పాయింట్ల మార్కు వద్ద నిలిచింది. నేడు సెన్సెక్స్ గరిష్టం గా 17582 పాయింట్ల వరకు , ఒక దశ లో ఎగబాకింది. ఇది మేము ఉదయం సూచించిన 17578 పాయింట్లకి అత్యంత సమీపం గా ఉండటం గమనార్హం. అదే విధం గా కనిష్ట స్థాయి ల లో కూడా మేము సూచించిన 17373 పాయింట్లు నిలబడటం విశేషం . నేడు సెన్సెక్స్ కనిష్టం గా 17378 పాయింట్ల కు చేరుకుంది. నేటి ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ , స్మాల్ క్యాప్ రంగాలు వాటి హవా కొనసాగించాయి. ఈ రంగా లు 1.5 .% , 1. 6 % చొప్పున ఎగబాకాయి. నేటి ట్రేడింగ్ లో సిమెంట్ ఎగుమతుల గణాంకాల ఆశా జనకం గా వుండటం తో సిమెంట్ స్టాకు లు లాభపడి నిన్న ప్రచురించిన మార్కెట్ ముందు చూపు శీర్షిక లో ని మా అంచానాలను నిజం చేసాయి. నేటి ట్రేడింగ్ సమయం లో విడుదల అయిన PMI ఇండెక్స్ లో కూడా వృద్ధి కనపడటం తో మార్కెట్ల సెంటిమెంట్ బలపడింది. పైగా ఐరోపా మార్కెట్లు కూడా లాభాల తో శుబారంభం చేయటం కూడా మన మార్కెట్లకు కలిసొచ్చింది. సెన్సెక్స్ పెద్ద బాబు రిలయన్స్ , ట్రెజరీ వాటాలను రూ. 1035 చొప్పున అమ్మటం తో ఈ కౌంటర్ సుమారు 1 .3 % నష్టపోయింది. ఈ కారణం గా నేటి ట్రేడింగ్ లో ఆయిల్ మరియు చమురు రంగం 0.21 % నష్ట పోయేందుకు కారణమయ్యింది. కేవలం ఈ రంగం మాత్ర మే సెక్టోరల్ ఇండెక్స్ ల లో నష్టాలను చవిచూసింది. కాగా ఆటో ఇండెక్స్ 1.88 %, మెటల్స్ 1.82 % మేరకు లాభపడ్డాయి. సెన్సెక్స్ స్టాకు లను పరిశీలిస్తే . నేడు ACC 4.9 % , JP ASSOCIATES 4. 7 % మేరకు లాభపడ్డాయి. కాగా NTPC 1.6 % , రిలయన్స్ 1.3 % నష్టపోయాయి.