• మార్కెట్ ముందు చూపు
  • (4-1-2010 నుండి 8-1-2010 వరకు )

అద్భుతమైన 2009 తరువాత 2010 సంవత్సరపు ట్రేడింగ్ ని ఉదయం 9 గంటల నుండి ప్రారంభం కానున్నది. ప్రస్తుతానికి సెబి ట్రేడింగ్ ముగింపు సమయం యదాతతం గా ఉంచింది. ఐతే , వచ్చే రెండు సంవత్సరాల లోపు ట్రేడింగ్ సమయాన్ని రాత్రి 11 గంటలవరకు పొడగించ నున్నట్లు ప్రకటించింది. ఈ వారం మదుపర్లు ముఖ్యం గా సిమెంట్ రంగాలకి చెందిన డిసెంబర్ తాలూకు గణాంకాలు మదుపరుల దృష్టి ని ఆకర్షించానున్నాయి. జనవరి మొదటి రెండు వారాల లో ప్రతిసారి లాగే, ఈ సారి గూడ ప్రముఖ కంపనీలు తమ త్రయి మాసిక ఫలితాలను విడుదల చేయనున్నాయి. ఈ అంశం ఆయా స్టాకులను ప్రభావితం చేయనున్నది. ఐ. పి. ఓ విషయాలను చర్చిస్తే, ఈ వారం JSW ENERGY అరంగ్రేట్రం చేయనున్నది. ఈ ఐ. పి ఓ పెద్దగా మదుపర్ల దృష్టి ని ఆకర్షించ లేక పోయింది. రేపు లిస్టింగ్ తరువాత ఎంత మటుకు లాభాల పంట పండించనున్నదని ఆసక్తి తో మదుపర్లు ఎదురు చూడనున్నారు. . ఐతే గత మాసం కాక్స్ యండ్ కింగ్స్ లిస్టింగ్ లో చోటు చేసుకున్న ముఖ్య సంఘటన ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఈ స్టాక్ లిస్టింగ్ లో తొలుత నష్టపోయి, ఆ రోజు ట్రేడింగ్ ముగింపు కి విపరీతం గా ఎగబాకిన విషయం మీకు తెలుసు. ఇందుకు కారణం విశ్లేషిస్తే , లిస్టింగ్ తరువాత, స్టాకులు నష్టపోతున్నాయన్న అంచనాల తో భారి షార్ట్ లు ముందుగా మార్కెట్ల లో ఏర్పడ్డాయి. లిస్టింగ్ ఐన షేర్ల కన్నా కూడా అధిక మొత్తం లో షార్ట్ లు ఏర్పడటం తో షార్ట్ కవేరింగ్ నేపధ్యం లో భారి వృద్ధిని సాధించిందని మదుపర్లు గ్రహించాలి. కాబట్టి JSW ENERGY లిస్టింగ్ లో ఇరుక్కుపోకుండా చూసుకోవటం మంచిది. గత వారం అమెరికా మార్కెట్లు నష్టాల తో ముగియటం తో మన మార్కెట్లు సోమవారం కొంత అమ్మకాల వత్తిడి గి గురి అయ్యే అవకాశం లేకపోలేదు. ఐతే, మార్కెట్లు ఆటో రంగానికి చెందినా గణాంకాల నేపధ్యం లో కొంత ముందుకు దూసుకు పోయే అవకాశం కూడా ఉంది. కాబట్టి అప్రమత్త తో ట్రేడ్ చేయడం మంచిది. ఐతే అంతర్జాతీయ పోకడలు మన మార్కెట్లను ఎప్పటి కప్పుడు ప్రభావితం చేసే అవకాశం వున్నా మన దేశ ఆర్ధిక పరిస్థతి ఇతర దేశాల కంటే కొంత మెరుగ్గా ఉన్న నేపధ్యం లో ఇప్పటివరకు కనపరచిన పటిష్టత మును ముందు కూడా మార్కెట్లు కనపరచ వచ్చు. ఐతే సమీప భవిష్యత్తు లో , మార్కెట్లను ప్రధానం గా రిజర్వు బ్యాంక్ కీలక వడ్డీ రేటు పై తీసుకోన బోయే నిర్ణయం పైన ఆధార పడనున్నది. ఈ నేపధ్యం లో రిజర్వు బ్యాంక్ డిప్యుటి గవర్నర్ చక్రబర్తి ఈ అంశం పై 29 న జరగబోయే సమావేశం లో నిర్ణయం చేయనున్నట్లు స్పష్టం చేయటం వలన మార్కెట్లు , ప్రస్తుతానికి ద్రవ్యోల్బణం పెరుగు తున్నా కూడా మార్కెట్లు ఇప్పుడే ఈ అంశం పై దిగులు చెందే అవకాశం లేదు. గత వారం ట్రేడింగ్ కి సెలవల కారణం గా దూరం గా ఉన్న విదేశీ మదుపర్లు , ఈ వారం మరల అన్చలూ వారిగా ట్రేడింగ్ లో పాల్గొనే అవకాశం ఉంది. స్టీల్ , సిమెంట్ ధరలు పెరుగుతున్న నేపధ్యం లో ఈ వారం , ముఖ్యం గా స్టీల్ రంగం కొంత పుంజుకునే అవకాశం ఉంది.

ఏది ఏమైనప్పటికీ, 2009 లో మార్కెట్ల లో చోటు చేసుకున్న 81 % ర్యాలి ని 2010 లో CONSOLIDATE చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి గత సంవత్సరం తో పోలిస్తే మార్కెట్లు గొప్పగా ఎగబాకే అవకాశం ఉండకపోవచ్చు. 2010 సెన్సెక్స్ గరిష్టం గా సుమారు 23000 పాయింట్లు కాగా కనిష్టం గా 10890 పాయింట్లు కాగలదని మా అంచనా. ఈ వారం టెక్నికల్ గా పరిశీలిస్తే, గత వారం పరిస్థితే ఈ వారం కూడా కనపడుతోంది. సెన్సెక్స్ నాకి 17493 అత్యంత కీలక అవరోధం. ఈ అవరోధం నిర్ణయాత్మకం గా చేదిస్తే గాని మార్కెట్లు పైకి ఎగబాకే అవకాశం లేదు. ఈ వారానికి 17493-17620-17735-17824 పాయింట్లు కీలక అవరోధాలు కాగా ,17237-17120-17002-16810 పాయింట్ల స్థాయిలు ముఖ్య మద్దతులు.