• PLEASE NOTE:

To get daily free STOCK tips on your mobile, please type ON give space, then again type TELUGUSTOCKMARKET and sms to 9870807070. This service is free of cost and is available through out INDIA ..

  • తెలుగు వారికి శుభ వార్త !

ఇప్పుడు స్టాక్ మార్కెట్ టిప్స్ మీ మొబైల్ లో ఉచితం గా లభ్యం ! TELUGU STOCKMARKET . COM నుండి మన తెలుగు వారికి అపూర్వ కానుక. ప్రతీ రోజు సలహా పేజి లో సూచిస్తున్న TIPS మీకు మీ CELL PHONE లో లభిస్తాయి! రిజిస్టర్ చేసుకునేందుకు మీరు మీ మొబైల్ లో ON అని టైపు చేసి, స్పేస్ ఇవ్వండి.తరువాత TELUGUSTOCKMARKET అని టైపు చేసి 9870807070 నకు SMS పంపించండి.! ఇక ప్రతీ ఉదయం మీ ఫోన్ నుండి కూడా మా సేవలు మీరు అందుకోవచ్చు.. పూర్తి గా ఉచితం గా !

  • 31 - 12- 2009
  • మార్కెట్ రిపోర్ట్

2009 సంవత్సరాంతమైన గురువారం బాంబే స్టాక్ మార్కెట్ లాభాలతో ముగిసింది.నిన్న బుధవారం నష్టాలను చవిచూసిన సెన్సెక్స్ గురువారం.. డిసెంబరు 19తో ముగిసిన వారాంతానికి ద్రవ్యోల్బణం 19.83 శాతానికి చేరుకున్నప్పటికీ ఆశాజనకంగా ముగిసింది. దీంతో నేటి ట్రేడింగ్ ముగిసే సమయానికి బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ 120 పాయింట్లు వృద్ధి చెంది, 17,464 పాయింట్ల మార్కు వద్ద ముగిసింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 32 పాయింట్లు బలపడి, 5201 పాయింట్ల మార్కు వద్ద నిలిచింది. గతఏడాది చివరికి 60శాతం వృద్ధిని నమోదు చేసుకున్న బాంబే స్టాక్ మార్కెట్ 2009లో 80శాతం మేర వృద్ధితో ఎగబాకింది. అలాగే డిసెంబరు 19తో ముగిసిన వారాంతానికి ద్రవ్యోల్బణం 19.83 శాతానికి చేరుకుంది. ఇందులో బంగాళా దుంపలు, పప్పు దినుసుల టోకు ధరలు మరింత పెరిగాయి. డిసెంబరు రెండవ వారంలో ద్రవ్యోల్బణం 18.65 శాతంగా ఉండింది. బంగాళా దుంపల ధరలు రెండింతలు పెరగగా, పప్పు దినుసుల ధరలు 41 శాతానికి పెరిగాయి. అదే విధంగా ఉల్లిపాయలు ధరలు 40.75 శాతం పెరిగాయి. కూరగాయల ధరలు 46.7 శాతం పెరగగా, పండ్ల ధరలు 10.35 శాతం పెరిగాయి. అలాగే సజ్జలు 12 శాతం పెరగగా, గోధుమలు నాలుగు శాతం పెరిగాయి. బార్లీ గింజలు, ఉద్దిపప్పు ఒక శాతం పెరిగాయి.అయినప్పటికీ విదేశీ మార్కెట్లు ఊతమివ్వడంతో సెన్సెక్స్ వృద్ధి చెందింది. అలాగే దేశీయ వాటాల ట్రేడింగ్, కొనుగోళ్లు పుంజుకోవడంతో బాంబే స్టాక్ మార్కెట్ వృద్ధిబాటలో కొనసాగింది. ఇంకా మదుపు దారులు విదేశీ కొనుగోళ్లపై మొగ్గుచూపడం, ఆయిల్, గ్యాస్, క్యాపిటల్ గూడ్స్, ఆటో, పవర్, బ్యాంక్, ఐటీ వాటాల కొనుగోళ్లు పుంజుకోవడంతో బాంబే స్టాక్ ఎక్చేంజ్ లాభాలతో ముగిసింది.

నేటి ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ రంగం 0.31 శాతం, స్మాల్ క్యాప్ రంగ 0.60 శాతం లాభపడ్డాయి. సేక్టరాల్ ఇండెక్స్ ల లో పవర్ రంగం 1.16 %, క్యాపిటల్ గూడ్స్ 1.10 % మేరకు ఎగబాకాయి. కాగా నేటి ట్రేడింగ్ లో FMCG 0.19 %, హెల్త్ కేర్ 0.14 % క్షీణించాయి .

సెన్సెక్స్ స్టాకు ల లో JP ASSOCIATES , SBI 3.2 %, 2 % చొప్పున లాభపడ్డాయి. కాగా DLF 1.3 %, సన్ ఫార్మ 0.8 % నష్టపోయాయి.