• 4-1-2010
  • మార్కెట్ నాడి

2010 సంవత్సరానికి మునుపెన్నడూ లేని విధం గా , ముందుగానే , అంటే ఉదయం 9 గంటలకే మార్కెట్లు స్వాగతం పలకనున్నాయి. మన మార్కెట్ల లో ట్రేడింగ్ సమయం లో మార్పు చేసుకుంటే, జపాన్ లో టోక్యో స్టాక్ ఎక్స్ చేంజ్ ,అత్యధికం గా ట్రేడింగ్ ని ఆకర్షించేందుకు గాను ప్రపంచంలో నే అత్యంత వేగమైన టెర్మినల్ ని నేడు ప్రారంభించింది. ఈ సంవత్సరం లో మొదటి సారిగా, మార్కెట్ పోకడలను పరిశీలిస్తే, డిసెంబర్ చివరన ముగిసిన అమెరికా మార్కెట్లు మెరుగవు తున్న పరిస్థితి ని సూచిస్తూ నిరుద్యోగం తగ్గు ముఖం పడుతున్నదని గణాంకాలు విడుదల అయినప్పటికీ, ప్రాఫిట్ బుకింగ్ చోటు చేసుకోవటం వలన స్వలంగా నష్టాల తో 2009 ని ముగించింది. అమెరికా ఫేడ్ అధ్యక్షులు బెర్నంకే .. అసెట్ బుడగ కి నిర్వీర్యమైన పర్యవేక్షణనే కారణమని , వడ్డీ రేటు తగ్గించటం లో తప్పు లేదని, ఐతే ప్రస్తుతం పరిస్థితి కోలుకోనున్న దృశ్యా వడ్డీ రేటు ని పెంచే అవకాశం ఉందని ప్రకటించారు. ఈ నేపధ్యం లో అమెరికా డాలర్ బలపడే అవకాశం ఉంది. పైగా ముడి చమురు ధరలు పెరగవచ్చన్న అంచనాల తో ,దిగుమతి దారులు కూడా అమెరికా డాలర్ పై ఆసక్తి కనబరుస్తున్నారు. ఐతే అమెరికా మార్కెట్ల సానుకూల గణాంకాల కారణంగా నేడు సింగపూర్ మినహా ఇతర ఆసియా మార్కెట్లు , లాభాల లో పయనిస్తున్నాయి. సింగపూర్ లో ఈ త్రై మాసికం లో GDP లో 6.8 % తగ్గుదల నమోదు కావటం బలహీనత కి కారణమయ్యింది. ఇక మన మార్కెట్ల పరం గా ఆలోచిస్తే , ఎనెర్జీ ఫైనాన్స్ లో అగ్రగామి ఐన BMO CAPITAL , భారత్ , చైనా మార్కెట్ల లో అభివృద్ధి గణనీయం గా ఉండగలదని అంచనాలను ప్రకటించటం మన మార్కెట్ల కి కొంత బలం చేకూర్చ నున్నది. ఎనెర్జీ రంగాల లో ప్రభుత్వం ఇకపై ప్రాజెక్ట్ల పై పరిమితి ఉంచనున్నట్లు, ఒక్క డెవలపర్ కే అన్ని ప్రాజెక్ట్లు అప్పగించటం సబబు కాదని ప్రకటించటం వలన కూడా , చిన్ని తరహ ఎనెర్జీ కంప నీలకు లాభదాయకం. అదే విధం గా IRDA రాగల 15 రోజుల లో ఇన్సురన్సు కంపనీల IPO ల పై విధానం ప్రకటించనున్నట్లు పేర్కొనటం వలన ప్రై వేటు ఇన్సురన్సు కంపనీల స్టాకుల లో కొంత స్పెకులేషన్ చోటు చేసుకునే అవకాశం ఉంది. అదే విధం గా పెట్రో బాస్ భారత దేశం లో ఉన్న తమ వాటా ని ONGC కి అమ్మివేయాలని నిర్ణయించుకోవటం వలన ఈ వాటా లో కూడా కొంత సంచలన కనపడవచ్చు. గత 14 మాసాల లో మొదటి సారి గా ఎగుమతులు వృద్ధి సాధించినట్లు వెలువడిన గణాంకాలు కూడా మన మార్కెట్ల సెంటిమెంట్ ని బలపరిచే అవకాశం ఉంది. టెక్నికల్ గా సెన్సెక్స్ న కు 17493 పాయింట్లు కీలక అవరోధం మార్కెట్లు మరింత గా పుంజుకునేందుకు ఈ అవరోధం నిర్వివాదం గా చేదించటం ముఖ్యం. సానుకూల సంకేతాల నడుమ నేడు మార్కెట్లు ఈ అవరోధాన్ని గట్టి ప్రయత్నం చేయనున్నాయి. నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :

  • గత ముగింపు: 17464
  • అవరోధాలు: 17493-17578-17620-17735
  • మద్దత్తులు:17373-17240-17124