- 29-1-2010
- మార్కెట్ రిపోర్ట్
ఐరోపా మార్కెట్ల బలమైన సంకేతాల తో నేడు మన మార్కెట్లు నష్టాలనుండి లాభాల లో పయించాయి. దీనితో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 51 పాయింట్లు లాభపడి 16358 పాయింట్ల వద్ద ముగియగా, నిఫ్టీ 15 పాయింట్ల ను ఆర్జించి 4882 పాయింట్ల వద్ద ముగిసింది. నేడు రిజర్వు బ్యాంక్ కీలక ద్రవ్య పరపతి విధానం ప్రకటించింది. CRR ని 75 బేసిస్ పాయింట్లను పెంచి , రిపో , రేవేర్స్ రిపో రేట్లను యధాతదం గా ఉంచింది. దీనితో CRR 5 % నుండి 5.75 % పెరిగినట్లయ్యింది. ఐతే వచ్చే సంవత్సరపు GDP 6 % నుండి 7 .5 % గా ఉండగలదని అంచనా ప్రకటించింది, అదే విధం గా ద్రవ్యోల్బణం మార్చి 2010 అంతానికి సుమారు 8 .5 % వరకు పెరిగే అవకాశం ఉందని ప్రకటించింది. దీనితో అసలే బలహీనం గా ప్రారంభమైన సెన్సెక్స్ మరింత గా క్రుంగి పోయి కనిష్టం గా 15982 పాయింట్ల వరకు పడిపోయింది. ఐతే ఐరోపా మార్కెట్లు లాభాల తో ప్రారంభమవ్వటం, వారంతం లో జరిగిన షార్ట్ కవేరింగ్ మున్నగు అంశాలు మార్కెట్లను తిరిగి లాభాల బాట లో నడిపించాయి. నేటి ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ రంగం 1.01 శాతం. స్మాల్ క్యాప్ రంగం 1.2 శాతం లాభపడ్డాయి. సెక్టోరల్ ఇండెక్స్ ల లో బ్యాంకింగ్ రంగం అత్యధికం గా 2.99 % , రియాలిటి రంగం 2.60 % ఎగబాకాయి. కాగా FMCG 1.86 % , మెటల్స్ 1.56 % చొప్పున నష్టపోయింది. సెన్సెక్స్ స్టాకు ల లో ICICI బ్యాంక్ 5. 3 % ,BHEL 3.1 % మేరకు లాభపడ్డాయి. కాగా HUL 4.4 % , WIPRO 3. 8 % క్షీణించాయి.