- 29-1-2010
- మార్కెట్ నాడి
అమెరికా ఫేడ్ అధ్యక్షులు బెర్నంకే ఎట్టకేలకు తమ పదవి కి మరొక సారి ఎన్నికయ్యారు. ఈ అంశం గత రాత్రి అమెరికా మార్కెట్లకు ఊరట కలిగించే అంశం అయినప్పటికీ , పెరుగుతున్న నిరుద్యోగ సమస్య, ఆర్ధిక అస్థిరత అమెరికా మార్కెట్లను కుదేలు మనిపించాయి. పైగా బలహీనమైన బ్యాంకింగ్ వ్యవస్థపై అంతర్జాతీయ రేటింగ్ సంస్థ S & P - UK దేశపు రేటింగ్ ని తగ్గించటం కూడా అమెరికా మార్కెట్ల బలహీనతకి ఊతం అందించింది.
దీనితో నేడు అసియా మార్కేట్లాని కూడా అత్యంత బలహీనం గా ట్రేడ్ అవుతున్నాయి. నేడు జపాన్ లో పెరుగుతున్న ప్రతిద్రవ్యోల్బనం , అక్కడి మార్కెట్ల పై ప్రతికూలం గా ప్రభావం చూపుతున్నది.
నేడు మన మార్కెట్లు కూడా బలహీనమైన ఆసియా మార్కెట్ల నేపధ్యం లో నష్టాలను మూట గట్టుకునే అవకాశం ఉంది. పైగా రిజర్వు బ్యాంక్ ద్రవ్య పరపతి విధానం నేడు ప్రకటించ నున్నది. ఈ నేపధ్యం లో ఇప్పటికే CRR రేటు ని రిజర్వు బ్యాంక్ 50 బేసిస్ పాయింట్లను పెంచ గలదని సర్వత్రా అభిప్రాయం వెల్లడవుతున్నది . ఐతే రివర్స్ రిపో రేటు ని కూడా బ్యాంక్ పెంచితే మార్కెట్లు మరింత ప్రతికూలం గా స్పందించే అవకాశం ఉంది. కాగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం ని నియంత్రించేందుకు రిజర్వు బ్యాంక్ కీలక వడ్డీ రేటు ని పెంచే అవకాశం లేకపోలేదు. ఈ అంశాల నేపధ్యం లో నేడు మార్కెట్ల లో మరొక సారి BEARS తమ సత్తా ని చాట వచ్చు
నేటి ట్రేడింగ్ లో 15831 సెన్సెక్స్ నకు కీలక మద్దత్తు.
- నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
- గత ముగింపు: 16306
- అవరోధాలు: 16340-16477-16606-16765
- మద్దత్తులు:16252 -16124-16064-15957 - 15831