- 28-1-2010
- మార్కెట్ రిపోర్ట్
సుమారు వారం రోజుల తరువాత , మా అంచనాలకి అనుగుణం గా నేడు బుల్ల్స్ మరొక సారి రంగ ప్రవేశం చేసాయి. దీనితో మన మార్కెట్లు , మధ్య లో ఆటుపోట్లకి గురి అయినప్పటికీ, చివరికి అతి స్వల్ప లాభాలను ఆర్జించి ఫ్లాట్ గా ముగిసాయి. సెన్సెక్స్ నేడు 17 పాయింట్లు లాభపడి , 16307పాయింట్ల వద్ద ముగియగా, నిఫ్టీ 14 పాయింట్లు లాభపడి 4867పాయింట్ల వద్ద ముగిసింది.
నేటి ట్రేడింగ్ లో జనవరి F & O ముగింపు , ద్రవ్యోల్బణ గణాంకాలు మున్నగు అంశాలు ,మార్కెట్లను ఆటుపోట్లకి గురిచేశాయి. జనవరి 16తో ముగిసిన వారాంతానికి ద్రవ్యోల్బణం పెరిగి 17.40 శాతానికి చేరుకుంది. బంగాళా దుంపలు, పప్పు దినుసుల ధరల్లో మాత్రం తగ్గుదల కనపడలేదు. అదే అంతకు మునుపు వారాంతానికి చెందిన ద్రవ్యోల్బణం 16.81 శాతంగా ఉండింది. టోకు ధరల్లో బంగాళా దుంపల ధరలు నిరుడున్న ధరలతో పోలిస్తే 57.56 శాతం పెరిగాయి. అదేవిధంగా పప్పు దినుసుల ధరలు 46.87 శాతం పెరిగాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అదే విధంగా నిత్యావసర సరుకుల ధరలు 14.66 శాతం పెరిగాయి. దీనితో అప్పటివరకు గరిష్ట స్థాయి లో 16524 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతున్న సెన్సెక్స్ మరల నష్టాల బాట పట్టి కనిష్టం గా 16182 పాయింట్ల కు చేరుకుంది. మరల షార్ట్ కవేరింగ్ నేపధ్యం లో కోలుకుని ఫ్లాట్ గా ముగిసింది.
నేటి ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ రంగం 0.24 % లాభపడగా , స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.2 శాతం నష్టాన్ని నమోదు చేసింది.
సేక్తోరాల్ ఇండెక్స్ ల లో నేడు రియాలిటి , హెల్త్ కేర్ 1.6 %, 1.3 % చొప్పున లాభపడ్డాయి. కాగా క్యాపిటల్ గూడ్స్ ౦.౩ %, FMCG 0.2 % చొప్పున బలహీనపడ్డాయి.
అనూహ్య ఫలితాల నేపధ్యం లో నేడు టాటా స్టీల్ భారి గా లాభపడింది.సెన్సెక్స్ వాటాల లో టాటా స్టీల్ నేడు 4.8 శాతం ఎగబాకి అగ్రగామిగా నిలిచింది. కాగా , నేడు మేము ట్రేడింగ్ కి సూచించిన విప్రో 2.8 % లాభపడి బుల్ల్స్ కి తోడ్పడింది. కాగా భారతి అయిర్ టెల్ 2.4 % , RCOM 2 % నష్టాలను చవిచూసాయి.