- NOTE : This report is revised at 8: 57 am on account of US President OBAMA address. Readers are requested to note the same
- 28-1-2010
- మార్కెట్ నాడి
గత వారం రోజులుగా అతలాకుతలం అవుతున్న మన మార్కెట్లకి నేడు కొంత ఉపశమనం కలగనున్నది. గత రాత్రి అమెరికా మార్కెట్లు , అక్కడి బ్యాంక్ కీలక రేట్ల లో ఎటువంటి మార్పుని ఫేడ్ అధ్యక్షులు బెర్నంకే సూచించక పోవటం తో అక్కడి మార్కెట్లు ఊపిరి పీల్చుకున్నాయి. అమెరికా మార్కెట్లు ముగిసిన తరువాత చేసిన ప్రసంగం లో అమెరికా ప్రెసిడెంట్ ఒబామా బ్యాంకు ల తిరిగి చెల్లించే $ 30 బిలియెన్ డాలర్ల అప్పుని కొత్త ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఉపయోగించ నున్నట్లు ప్రకటించటం కూడా కొంత ఊరట కలిగించే అంశం .ఐతే వాల్ స్ట్రీట్ పై నియంత్రణ చేయనున్నట్లు ప్రకటించారు. నేడు ఆసియా మార్కెట్లు కూడా లాభాల లో పయనిస్తున్నాయి .ఐతే ఒబామా ప్రకటన పై మరిన్ని వివరాల కోసం ఆసియా మార్కెట్లు ఎదురు చూడనున్నాయి.
ఈ రిపోర్ట్ ప్రచురించే సమయానికి వున్న పరిస్థితి సమీక్షిస్తే ,సానుకూల ఆసియా మార్కెట్ల ప్రభావం నేపధ్యం లో నేడు కొంత పుల్ బ్యాక్ ర్యాలి మన మార్కెట్ల లో చోటు చేసుకునే అవకాశం లేకపోలేదు, ఈ కారణం గా మన మార్కెట్లు నేడు కొంత శుభారంభం చేసే అవకాశం కూడా ఉంది రేపు రిజర్వు బ్యాంక్ ద్రవ్య పరపతి విధానం ప్రకటించ నున్నది. ఈ అంశం మార్కెట్లను గత కొన్ని రోజులు గా బెంబేలు పుట్టిస్తున్నది. కాగ నేడు జనవరి F & o ముగింపు . నేడు జరగ బోయే రోల్ ఓవర్ల పై మార్కెట్ల గమనం ప్రధానం గా ఆధార పడనున్నది. వారం వారం విడుదల అయ్యే ద్రవ్యోల్బణ గణాంకాలు కూడా మన మార్కెట్లను ప్రభావితం చేసే అవకాశం ఉన్నది. నేడు జరగ బోయే జనవరి డేరివేటి వ్స్ ముగింపు పైనే మార్కెట్ల దిశ ప్రధానం గా ఆధారపడ నున్నది . ఒబామా ప్రకటన పై వివరాలు తెలియవస్తే మార్కెట్లు తమ దిశ నిర్దుష్టం గా నిర్ణయించుకునే అవకాశం ఉంది
- నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
- గత ముగింపు: 16289
- అవరోధాలు: 16340-16477-16606-16765
- మద్దత్తులు:16252 -16124-16064-15957