• 27-1-2010
  • మార్కెట్ రిపోర్ట్
బలహీనమైన ప్రపంచ మార్కెట్ల కి తోడుగా, రిజర్వు బ్యాంక్ శుక్రవారం ప్రకటించ బోయే ద్రవ్య పరపతి విధానంనేపధ్యం లో మార్కెట్లు నేడు భారి గా కోల్పోయాయి. నిన్న మన మార్కెట్ల కి సెలవకారణం గా ప్రపంచ మార్కెట్ల నిన్నటి నష్టాన్ని సైతం నేడు మన మార్కెట్లు పరిగణ న లో తీసుకోవటం తో నష్టాలు ద్విగుణం త్రిగుణం అయ్యాయి. దీనితో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ సెన్సెక్స్ ఏకంగా 490 పాయింట్లు కోల్పోగా , నిఫ్టీ 155 పాయింట్లు నష్టపోయింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 16289 పాయింట్ల వద్ద, నిఫ్టీ 4853 పాయింట్ల వద్ద ముగిసింది. మధ్యాన్నం తాజా ట్రేడింగ్ లో ఐరోపా మార్కెట్లు కూడా భారి నష్టాల తో ప్రారంభమవ్వటం ---మన మార్కెట్లకి కీలక మద్దతులు కోల్పోవటం తో నేడు ఆశించిన షార్ట్ కవెరింగ్ మార్కెట్ లో చోటుచేసుకోలేదు. దీనితో అమ్మకాల వత్తిడి మరింతగా పెరిగి మార్కేట్లని మరింతగా కృంగ దీసాయి. దీనితో F & O లో కూడా అత్యధికం గా 183019 , 158504 కోట్లు చొప్పున టర్న్ ఓవర్ నమోదు అయ్యింది.
నేటి ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ రంగం 4 % , స్మాల్ క్యాప్ రంగం 5 % నష్టపోయింది.
సేక్టరాల్ సూచీలు అన్ని కూడా నేడు భల్లుకాల బారి పడ్డాయి. నేటి ట్రేడింగ్ లో రియాలిటి ఇండెక్స్ అత్యధికం గా 8 % కోల్పోగా , లోహాల సూచీ 5.8 % నష్టపోయింది.
సెన్సెక్స్ స్టాకు ల లో నేడు ITC మినహా ఇన్ని వాటాలు నష్టపోయాయి . ITC 0.4 శాతం పెరిగి బుల్ల్స్ పక్షాన నిలిచింది. కాగా టాటా స్టీల్ 8.5 %, DLF 7.8 % అత్యధికం గా క్షీణించాయి .