• 22-1-2010
  • మార్కెట్ నాడి

భారత్ , చైనా దెబ్బలకి ప్రపంచ మార్కెట్లు అతలాకుతలం అయ్యాయి. ఆసియా మార్కెట్ల లో క్షీణత తో ప్రారంభమైన ప్రకంపనలు నిన్న అమెరికా మార్కెట్లను కూడా వదల లేదు .దీనితో గత రాత్రి అప్ప్రమత్త ధోరణి తో ప్రారంభమైన అమెరికా మార్కెట్లు , తదుపరి ప్రెసిడెంట్ బరాక్ ఒబామా .. హెడ్జ్ ఫండ్స్ మరియు ఈక్విటీ ల లో బ్యాంకుల పెట్టుబడులను నియంత్రించ నున్నట్లు ప్రకటించటం తో అమెరికా మార్కెట్లు కుదేలు మన్నాయి. దీనితో అమెరికా మార్కెట్ల లో అమ్మకాల వత్తిడిపెరిగి బుల్ల్స్ కి నిలువ నీడ లేకుండా చేసాయి. ఇప్పటివరకు sell off కోసం మార్కెట్ వర్గాల ఎదురుచూపు నిన్నటి కి ప్రారంభమయ్యింది. పైగా అమెరికా లో పెరిగిన నిరుద్యోగ గణాంకాలు , ఫిలడెల్ఫియా లో తగ్గినా ఉత్పత్తి గణాంకాలు కూడా మార్కెట్లని పడదోసేందుకు సహకరించాయి. నేటి ఆసియా మార్కెట్ల ను పరిశీలిస్తే, నిన్న లాభపడ్డ జపాన్ మార్కెట్లు , ప్రపంచ మార్కెట్ల కి అనుసంధానం గా సుమారు 2.8 % నష్టాలను నమోదు చేస్తూ పయనిస్తున్నాయి. ఇతర ఆసియా మార్కెట్లు కూడా సుమారు 1.7% మేరకు నష్టపోతున్నాయి .

చైనా లో గణాంకాల విభాగం విడుదల చేసిన ప్రకటన లో ఇప్పటి వరకు ప్రతీసారి ప్రస్తావించే సరళీకృత విత్త విధానం , ఈ సారి ప్రకటన లో లేకపోవటం వంటి అంశాల వలన , అతి త్వరలో చైనా ప్రభుత్వం , మార్కెట్ల పై తమ పట్టుని బిగించే అవకాశం ఉన్నదన్న అంచనాల తో అక్కడి మార్కెట్లు కూడా నిన్నటి నష్టాలను కొనసాగిస్తున్నాయి. ముడి చమురు, రాగి మున్నగు కమో డి టి లు కూడా తీవ్రం గా నష్టపోతున్నాయి. మన దేశ పరిస్థితి ని అంచనా వేస్తె , రుతుపవనాలు విఫలం కావటం వలన ఈ సారి వ్యవసాయరంగ దిగుబడి గణనీయం గా తగ్గి ఆహార ధాన్యాల ధరలు పెరిగే అవకాశం ఉందని , దీని ద్వారా ద్రవ్యోల్బణం మరింత గా పెరగ నున్న దని అంచనాలు వెలువడుతున్న నేపధ్యం లో రిజర్వు బ్యాంక్ కీలక వడ్డీ రేటుని పెంచే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి . కాబట్టి నేడు మార్కెట్లు భారీగా క్షీణించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఐతే ,సాంప్రదాయేతర ఇంధన వనరులను పెంపొందించే దిశలో ప్రభుత్త్వం నియమాలను మార్చనున్నది. దీనివలన విద్యుత్ ఉత్పాదకులు తప్పనిసరిగా తమ ఉత్పత్తి లో కొద్ది భాగం సౌర , వాయు శక్తులను ఉపయోగించి విద్యుత్ ఉత్పత్తి చేయవలసి ఉంటుంది. కాబట్టి నేటి ట్రేడింగ్ లో బుల్ల్స్ ప్రధానం గా SUZLON , INDO WIND ENERGY మున్నగు స్టాకుల వెనుక ఆశ్రయం పొందే అవకాశం ఉంది. అదే విధం గా ,నేడు విడుదల కానున్న రిలయన్స్ ఫలితాలను బుల్ల్స్ మరియు బెర్స్ ఆసక్తి గా గమనించ నున్నాయి. ఏది ఏమైనప్పటికీ , నేడు కూడా మార్కెట్లు పతనం కానున్నాయి. అంటే నిన్న ఉదయం మేము సూచించిన దిద్దుబాటు ప్రక్రియ నేడు కూడా కొనసాగానున్నది.. నేడు మా చదువరులకు మేము సూచించే ఒకే ఒక తారక మంత్రం “ SELL .. SELL...SELL... SELL...SELL ...SELL .. SELL. “ .మీ పోర్ట్ ఫొలియో లను తగ్గించుకోండి.! నేటి ట్రేడింగ్ లో 16780 సెన్సెక్స్ నకు కీలక మద్దత్తు

  • నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
  • గత ముగింపు:17051
  • అవరోధాలు: 17240-17373-17493
  • మద్దత్తులు:16810-16780-16686-16589