• 21-1-2010
  • మార్కెట్ రిపోర్ట్

మా అంచనాలకి అనుగుణం గా బలహీనం గా ప్రారంభమైన మన మార్కెట్లు , ప్రతికూల ద్రవ్యోల్బణ గణాంకాల నేపధ్యం లో కుదేలుమన్నాయి. దీనితో బొంబయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 424 పాయింట్లు నష్ట పోగా, నిఫ్టీ 127.5 పాయింట్లు కోల్పోయింది. నవంబర్ 2 తరువాత ఇంత భారి మొత్తం లో మార్కెట్లు నష్టపోవటం ఇదే ప్రథమం. దీనితో నేడు మార్కెట్ల లో స్టాకులు రక్త సిక్తం అయినాయి . మార్కెట్ ముగింపు కి నిఫ్టీ 5094 , సెన్సెక్స్ 17051 పాయింట్లు గా నమోదు అయ్యాయి. జనవరి 9 నాటికి ద్రవ్యోల్బణం రేటు 16.81 శాతానికి చేరుకుందని నేటి మధ్యానం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.. అదే జనవరి 2తో ముగిసిన వారాంతానికి ద్రవ్యోల్బణం 17.28 శాతంగా ఉండంది.అంటే వారం వారం పోలిక ల లో కొంత తగ్గుదల నమోదు అయినప్పటికీ వార్షిక ద్రవ్యోల్బణంతో పోలిస్తే కూరగాయల ధరలు 7.95 శాతం, పండ్ల ధరలు 3.73 శాతం పెరిగినట్లు ప్రభుత్వ నివేదిక తెలిపింది. అదే పాల ధరలు నిరుడు కన్నా 13.95 శాతం పెరిగింది. దీనికి ప్రధాన కారణం పాల ఉత్పత్తి తగ్గిపోవడంతో ఈ ధరలు పెరిగాయని నివేదిక పేర్కొంది. . గత సంవత్సరంతోపోలిస్తే బంగాళా దుంపలతోపాటు మరిన్ని ఆహార పదార్థాల ధరలు 49.31 పెరిగాయి. అదే పప్పు దినుసుల ధరలు 47.90 శాతం పెరిగాయి . ఈ పెరిగే ధరలు ఆహార ధాన్యాల నుండి ఉత్పత్తి , మరియు సేవా రంగాలకి కూడా వ్యాప్తి చెందకుండా రిజర్వు బ్యాంక్ సత్వర చర్యలు తీసుకునే అవకాశం ఉందని మార్కెట్లు భావించటం తో నేడు ప్రాఫిట్ బుకింగ్ చోటు చేసుకుంది. పైగా నేడు విడుదల అయిన LNT ఫలితాలు కూడా 7 సంవత్సరాల తరువాత ప్రప్రధమంగా తిరోగమనం సాధించటం కూడా మార్కెట్ల సెంటిమెంట్ ని తీవ్రం గా దెబ్బ తీసాయి. నేటి ట్రేడింగ్ లో మేము సూచించిన కీలక మద్దతు స్థాయిలు కూడా కోల్పోవటం తో మార్కెట్ల లో మేము ఉదయం చర్చించిన విధం గా దిద్దుబాటు కు గురి అయ్యింది. నేటి ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ రంగం 2.39 % , స్మాల్ క్యాప్ రంగం2.47 % కోల్పోయాయి. . సెక్టోరల్ ఇండెక్స్ లు అన్ని కూడా బెర్స్ పంజా కి బలి అయ్యాయి. నేడు క్యాపిటల్ గూడ్స్ 5.15% ,పవర్ ఇండెక్స్ 2.47 % మేరకు అత్యధికం గా నష్ట పోయాయి. సెన్సెక్స్ స్టాకు లను పరిశీలిస్తే , నేడు కేవలం MNM లాభ నష్టాలు లేకుండా యధాతదం గా ముగిసింది. కాగా LNT అత్యదికం గా 6 .85 % నష్టపోయింది. టాటా పవర్ కూడా 4 .46 % నష్టపోయి స్టాక్ మార్కెట్లు చావు దెబ్బ తినేందుకు కారణ మయ్యాయి.