- 21-1-2010
- మార్కెట్ నాడి
చైనా లో బ్యాంకులు ఇచ్చే రుణాల పై అక్కడి ప్రభుత్వం విధించిన నియంత్రణ వలన ప్రపంచ మార్కెట్లు కుదేలు మన్నాయి. చైనా లో ద్రవ్యోల్బణం కట్టు దిట్టం చేసి, వృద్ధిని క్రమబద్ధికరణ చేసే యోచన తో చైనా ప్రభుత్వం బ్యాంకుల పై పట్టు బిగించింది. ప్రపంచం లో ప్రస్తుతం వృద్ధికి ఉనికి పట్టు గా ఉన్న చైనా , వృద్ధి రేటుని నియంత్రించాలన్న యోచన వలన ఆర్ధిక సంక్షోభం తో అతలాకుతం అవుతున్న ఇతర ఆర్ధిక వ్యవస్థలు జీర్ణించుకోలేక పోయాయి. న ఈ కారణం తో నిన్న రాత్రి అమెరికా మార్కెట్లు కూడా తీవ్ర నష్టాలకు గురి అయ్యింది. పైగా నూతన గృహ నిర్మాణాల గణాంకాలు కూడా ఆశించిన దానికంటే తక్కువగా వుండటం కూడా అమెరికా మార్కెట్ల బలహీనతకి కారణమయ్యింది. ఐతే బ్లూమ్బెర్గ్ నిర్వహించిన సర్వే ప్రకారం చైనా లో అసెట్ బుడుగ ఏర్పడే ప్రమాదం ఉన్నందున ,మదుపర్లు అమెరికా మార్కెట్ల వైపే మగ్గుచూపునున్నారని తెలియ వచ్చింది . ఈ అంశం వలన అమెరికా డాలర్ బలపడింది దీనితో అమెరికా మార్కెట్లు, కొంత మేరకు నష్టాలని ముగింపు దశలో పూరించుకునే ప్రయత్నం చేసాయి. అమెరికా మార్కెట్లను అనుసరించి నేడు ఆసియా మార్కెట్లు కూడా బలహీనతని ప్రదర్శిస్తున్నాయి. ఐతే చైనా Q4 GDP వృద్ధి 10 .4 % గా వున్నదని నేడు గణాంకాలు విడుదల అయ్యాయి . పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాలు కూడా 18 .5 % వృద్ధిని నమోదు చేయటం గమనార్హం . నేడు కమోడిటి లు బలహీనం గా ఉన్నాయి. ఐతే చెక్కర ధరలకు మాత్రం రెక్కలు వచ్చి ప్రపంచ విపణి లో గరిష్ట స్థాయిని నమోదు చేసాయి . మన దేశానికి సంబంధించి , మార్కెట్లను ప్రభావితం చేయగల అంశాల ను పరిశీలిస్తే .. రిలయన్స్ , లోన్దేల్ ను విలీనం చేసే ప్రయత్నానికి ఎదురుదెబ్బ తగలటం వలన నేడు ఈ కౌంటర్ కి ప్రతికూల అంశం ఐనప్పటికీ, రిలయన్స్ ఫలితాలు ఈ త్రై మాసికం లో ఆశాజనకం గా ఉండగలదన్న అంచనాలు ఈ కౌంటర్ ని ప్రస్తుతానికి ఊరట కలిగించే అంశం . కాగా మోర్గాన్ స్టాన్లీ సంస్థ ఈ సంవత్సరం సెన్సెక్స్ నకు 19400 పాయింట్ల టార్గెట్ గా నిర్ధారించటం మన మార్కెట్ల సెంటిమెంట్ ని బలపరిచే విధం గా ఉంది. అదే విధంగా ప్రభుత్వ రంగ సంస్థ ల నుండి పెట్టుబడుల ఉపసంహరణ పై వెలువడే ప్రకటనలు కూడా నేడు మార్కెట్ల ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఐతే నేడు టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణ గణాంకాలు కూడా విడుదల కానున్నాయి .ఈ అంశం నేడు మన మార్కెట్లు నిశితం గా పరిశీలించ నున్నాయి . ప్రతికూల ప్రపంచ మార్కెట్ల నేపధ్యం లో నేడు మార్కెట్లు బలహీనం గా ప్రారంభం అయ్యే అవకాశం ఉంది . టెక్నికల్ గా పరిశీలిస్తే సెన్సెక్స్ అతి కీలక 17490 పాయింట్ల స్థాయి కీలకం . ఈ స్థాయి నిర్ణయాత్మకం గా కోల్పోతే స్వల్ప దిద్దుబాటు కి గురి అయ్యే అవకాశం ఉంది. అప్పుడు 17240 పాయింట్ల స్థాయి తదుపరి కీలక మద్దత్తు స్థాయి గా పరిగణించ వచ్చు
- నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
- గత ముగింపు: 17475
- అవరోధాలు: 17493-17578-17620-17735
- మద్దత్తులు:17373-17240-17124-17002