• 20-1-2010
  • మార్కెట్ రిపోర్ట్

నేడు ఆశాజనకం గా ప్రారంభమైన మార్కెట్లు చివరికి నష్టాలతో ముగిసాయి. దీనితో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 11పాయింట్లు కోల్పోయి 17474పాయింట్ల వద్ద స్వల్ప నష్టాన్ని నమోదు చేస్తూ ఫ్లాట్ గా ముగిసింది. కాగా నిఫ్టీ 4 పాయింట్ల నష్టం తో 5221 పాయింట్ల వద్ద ముగిసింది.

నేటి ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్౦.3 శాతం నష్టపోగా , స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.1 శాతం లాభపడటం విశేషం . నేడు చైనా మార్కెట్లు కోల్పోవటం తో ఆసియా మార్కెట్ల పతనానినికి శ్రీకారం చుట్టినట్లయ్యింది. చైనా ప్రభుత్వం , పెద్ద బ్యాంకు లను ఈ మాసానికి ఇక మీదట అప్పులివ్వడం తగ్గించు కోవలసినది గా సూచించటం తో అక్కడి మార్కెట్లు 3 % కోల్పోయాయి. ఈ ప్రభావం క్రమేపి మన మార్కెట్ల మీద కూడా చోటు చేసుకోవటం తో మన మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యింది. మధ్యాన్నం తాజా ట్రేడింగ్ లో ఐరోపా మార్కెట్లు కూడా నష్టాల తో ప్రారంభమవ్వటం తో మన మార్కెట్లకి కోలుకునే అవకాశం లేకుండా పోయింది.

నేటి ట్రేడింగ్ లో రియాలిటి ఇండెక్స్ 1.9శాతం, చమురు మరియు గ్యాస్ రంగం 1.3 శాతం అత్యధికం గా కోల్పోయాయి. కాగా టెక్ ఇండెక్స్0.7 శాతం, లోహం ఇండెక్స్ 0.5 శాతం లాభపడ్డాయి.

సెన్సెక్స్ స్టాకు ల లో నేడు అయిర్ టెల్ 3.4 %, మారుతి 2.6 % శాతం లాభపడగా, ongc 2.9 % ,JP ASSOCIATES 3.1 % నష్టపోయాయి