- 20-1-2010
- మార్కెట్ నాడి
గత రాత్రి అమెరికా మార్కెట్లు 15 నెలల గరిష్ట స్థాయి లో ముగియటం తో నేడు ఇతర ప్రపంచ మార్కెట్లు కూడా లాభాల బాట పట్టాయి. అమెరికా లో హెల్త్ బిల్ కి బ్రేక్ పడే అవకాశం ఉందన్న అంచనాల తో అక్కడి మార్కెట్లు లాభపడ్డాయి. నేడు ఆస్ట్రేలియా లో కన్సుమెర్ సెంటిమెంట్ బలపడటం , టెక్నాలజీ , స్టీల్ స్టాకు లు ఇతర ఆసియా మార్కెట్ల లో పుంజుకోవటం తో , (చైనా మినహా )ఆసియా మార్కెట్లు కూడా నేడు స్వల్ప లాభాల తో పయనిస్తున్నాయి. మన మార్కెట్ల పరం గా కీలక అంశాలను పరిశీలిస్తే,ఈ సంవత్సరం ఆర్థికాభివృద్ధి గణనీయం గా వుండగలదని వాణిజ్య శాఖా మాత్యులు ఆనంద్ శర్మ ప్రకటించటం మన మార్కెట్ల కు బలం చేకూర్చనున్నది. ఐతే మార్చ్ నాటికి నెల వారి ద్రవ్యోల్బణం 10 % మించ గలదని గణాంక శాఖ అధిపతి ప్రనాబ్ సేన్ ఒక టి.వి చానెల్ లో ప్రకటించటం కొంత ఆందోళన పరిచే అంశం . స్టాకు ల పరంగా .... ప్రభుత్వ రంగ చమురు సంస్థలకు ప్రభుత్వం సబ్సిడి ని నగదు రూపం లో చేల్లిస్తున్డటం వలన నేడు ఈ స్టాకుల కు కొంత ఊరట కలగానున్నది. ఇతర ప్రభుత్వ రంగ స్టాకులు కూడా నేడు మార్కెట్లను లాభాల బాట లో పయనింప చేసే ప్రయత్నం చేయనున్నాయి. విదేశాల నుండి చెక్కర దిగుమతులు జరగటం వంటి అంశాల వలన చెక్కర స్టాకులు కొంత బలహీనప డ వచ్చు. టెక్నికల్ గా సెన్సెక్స్ అతి కీలక మద్దత్తు అయిన 17490 పాయింట్ల వద్ద తచ్చాడుతున్నది. సానుకూల ప్రపంచ మార్కెట్ల నేపధ్యం లో ,ఈ మద్దతు సహాయం తో నేడు కొంత పుంజుకునే ప్రయత్నం చేయవచ్చు.సమీప కాలం లో ఈ మద్దత్తు స్థాయి అత్యంత కీలకం. ఇది వీగిపోతే స్వల్ప దిద్దుబాటు కి కూడా అవకాశం ఉందని గమనించాలి.
- నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
- గత ముగింపు: 17486
- అవరోధాలు: 17578-17620-17735-17824
- మద్దత్తులు: 17490-17373-17240-17124