- 19-1-2010
- మార్కెట్ రిపోర్ట్
దిశాహీనమైన ప్రపంచ మార్కెట్ల నేపధ్యం లో నేడు మన మార్కెట్లు బలహీనపడ్డాయి. దీనితో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 155 పాయింట్ల నష్టాన్ని మూటగట్టుకొని 17486పాయింట్ల వద్ద ముగిసింది, ఇది మేము ఉదయం సూచించిన కీలక మద్దత్తు ఐన 17493 పాయింట్లకి అత్యంత సమీపం గా ఉండటం గమనార్హం. అలాగే , నిఫ్టీ కూడా 49 పాయింట్లు క్షీణించి , 5226పాయింట్ల వద్ద ముగిసింది. నేటి ట్రేడింగ్ లో చివరి వరకు మార్కెట్లు తమ దిశని నిర్ణయించుకోలేక అటుపోట్లకి గురి అయ్యాయి. ఐతే ఐరోపా మార్కెట్లు నష్టాల తో ప్రారంభమవ్వటం తో మన మార్కెట్లు చివరి నిమిషాల లో నష్టానికి గురి అయ్యాయి.
నేటి ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ రంగం 0.63% , స్మాల్ క్యాప్ రంగం 0.56 % క్షీణించాయి. ఉదయం మా అంచనాలకి అనుగుణం గా నేడు కూడా ప్రభుత్వ రంగ సంస్థలు మార్కెట్ల లో తమ హవా కొనసాగించాయి. కాగా ఫార్టి లై జేర్ స్టాకులు కూడా నేడు బుల్ల్స్ కి తమ శక్తి వంచన లేకుండా తోడ్పడ్డాయి. ఐతే నేటి ట్రేడింగ్ లో కన్సుమర్ డ్యుర బుల్స్ , PSU , బ్యాంకింగ్ రంగం మినహా ఇతర ఇండెక్స్లునష్టపోవటం తో మార్కెట్లు కోల్పోయాయి. నేడు రియాలిటి రంగం 1.75, ఐ. టి. ఇండెక్స్ 1.68 % అత్యధికం గా నష్టపోయాయి .కాగా కన్సుమేర్ డ్యు ర బుల్స్ 0.74 % , బ్యాంకింగ్ రంగం 0.44 % మేరకు లాభపడ్డాయి.
సెన్సెక్స్ స్టాకు ల లో BHEL 0.86 % , SBI 0.76 % లాభపడ్డాయి . కాగా ACC 3.09 %, హిందాల్కో 2.63 % నష్టపోయాయి .